|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ilayaraja: ఇళయారాజా ఆస్తి ఎంత? ఈ మధ్య ఎక్కువగా వివాదాల్లోనూ

Published: 03-06-2025, 4:55 AM
Ilayaraja: ఇళయారాజా ఆస్తి ఎంత? ఈ మధ్య ఎక్కువగా వివాదాల్లోనూ

తమిళ సంగీత దిగ్గజం ఇళయరాజా గురించి ఈ కథనం. ఆయన సినీ ప్రస్థానం, ఆస్తి వివరాలు, తాజాగా ఆయనను చుట్టుముట్టిన వివాదాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Key Points

1

ఇళయరాజా రూ. 3-4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

2

దాదాపు రూ. 800 కోట్ల ఆస్తి ఈయన సొంతం.

4

తాజాగా కాపీరైట్ కేసులతో వివాదాల్లో ఇరుక్కున్నారు.

ఇళయరాజా సంగీత ప్రస్థానం

మ్యాస్ట్రో ఇళయరాజా.. ఈ పేరు చెప్పగానే సంగీత ప్రియులు పరవశించిపోతారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో పెద్దగా ఈయన మార్క్ కనిపించట్లేదు గానీ 80-90ల్లో ఈయన ఓ సినిమా చేస్తున్నారంటే చాలు సూపర్ హిట్ గ్యారంటీ అనేలా ఉండేది. మరి ఇళయరాజా ఇప్పుడేం చేస్తున్నారు? ఒక్కో చిత్రానికి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు?

తమిళనాడులో 1943లో ఇదే రోజున(జూన్ 03) పుట్టిన ఇళయారాజా.. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కర్ణాటిక్, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న ఈయన.. 1976లో ‘అనార్కలి’ అనే తమిళ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో డిఫరెంట్‌గా క్రియేట్ చేసిన సౌండ్.. ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. ఇక అప్పటి నుంచి ఈయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఆస్తి వివరాలు మరియు జీవన విశేషాలు

తెలుగు, తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో 1000కి పైగా సినిమాలకు ఇళయారాజా పనిచేశారు. 7000 పైచిలుకు పాటల కంపోజ్ చేశారు. నాయగన్, దళపతి చిత్రాలు ఈయన కెరీర్‌లోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పటికీ సినిమాలకు సంగీతమందిస్తున్న ఇళయరాజా.. ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఒకప్పటిలా తన సంగీతంతో ప్రభావం చూపించలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇళయరాజా వ్యక్తిగత జీవితానికొస్తే.. జీవా అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. ఈమె 2011లో చనిపోయింది. వీళ్లకు ముగ్గురు పిల్లలు. కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరిణి. ఈ ముగ్గురు కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. యువన్ రాజా.. తండ్రిలానే సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇళయరాజా ఆస్తి విషయానికొస్తే.. గ్రాండ్ చెన్నై బంగ్లాతో పాటు పలు స్టూడియోలు, అత్యాధునిక సంగీత పరికరాలు ఈయన సొంతం. అలానే దాదాపు రూ.800 కోట్లకు పైగా ఆస్తి ఈయనకు ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వివాదాలు మరియు వాటి ప్రభావం

ఇకపోతే ఇళయరాజా సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం.. 2010లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కొన్నాళ్ల ముందు వరకు ఈయన అంటే అందరికీ గౌరవం ఉండేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు దర్శక నిర్మాతలపై కాపీ రైట్ కేసులు పెడుతున్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇళయరాజా ఎందుకిలా చేస్తున్నారా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇళయరాజా గొప్ప సంగీత విలువను అందరూ అంగీకరిస్తారు. అయితే, తాజా వివాదాలు ఆయన ఖ్యాతిని ప్రభావితం చేస్తున్నాయి. సంగీతం ద్వారా ఆయన సాధించిన ఘనతలను మించిపోయేలా ఈ వివాదాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.