
📌 Key Points
- చందు యాక్సిడెంట్‌పై ప్రేమకు అనుమానం! ధీరజ్ విచారణతో కథనం మలుపు తిరుగుతుందా?
- శ్రీవల్లి ప్లాన్ రివర్స్! నర్మద పంచ్ డైలాగులతో శ్రీవల్లి కుట్ర బట్టబయలు
- అత్తారింట్లో పాతుకుపోవాలని శ్రీవల్లి ప్రయత్నాలు విఫలం! ప్రేమ కౌంటర్ ఎటాక్
- ప్రేమపై ధీరజ్ ప్రేమను నర్మద బయటపెట్టింది! అసలు నిజం ఏంటి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో సంచలన ట్విస్ట్! చందు యాక్సిడెంట్‌పై ప్రేమ అనుమానంతో కథ కొత్త మలుపు తిరిగింది. ధీరజ్ రంగంలోకి దిగడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి!
ప్రేమ అనుమానం నిజమేనా?
Illu Illalu Pillalu Serial April 11th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 11వ ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో ప్రేమ కోసం ధీరజ్ ఏడ్చాడని చెప్పి నర్మదా ఇరికిస్తుంది. చందు బావకు కావాలనే యాక్సిడెంట్ చేయించారేమో అని ప్రేమ డౌట్ పడుతుంది. దాంతో మరుసటి రోజు ధీరజ్ ఎంక్వైరీ చేస్తాడు.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమకు ప్రేమగా అన్నం తినిపిస్తాడు ధీరజ్. ప్రేమ మురిసిపోతుంది. కష్టాల్లో నిన్ను మీ ఇంటికి పంపించామని మీవాళ్లు కాకుల్లా కేకలు పెడతారని చూసుకుంటా అని చెప్పా. దానికి మురిసిపోకు అని ధీరజ్ అంటాడు. అలాగే, అంటాడు కానీ నీపై ధీరజ్‌కు చాలా ప్రేమ ఉందని నర్మద చెబుతుంది.
మరోవైపు క్యారెజ్ వంకతో అత్తారింట్లో పాతుకుపోతా అని శ్రీవల్లి సంతోషంగా గెంతుతూ వస్తుంది. మావయ్యను మాయ సేత్తే అయిపోతుందని శ్రీవల్లి అనుకుంటుంది. బ్రేకులు ఫెయిల్ అయితే డ్రైవర్ వేరే వైపుకు తిప్పొచ్చు. చందు బావ ఉన్నవైపే ఎందుకు వస్తుందని, పైగా చందు బావ పక్కకే ఉన్నారని ప్రేమ అంటుంది. అన్యయ్యను కావాలనే యాక్సిడెంట్ చేయాలని చూశారని అంటున్నావా అని ధీరజ్ అంటాడు.
శ్రీవల్లి కుట్రలు బట్టబయలు!
అప్పుడే వచ్చి విన్న శ్రీవల్లి ఏంటీ తెలిసిపోయిందా అని షాక్ అయి క్యారేజ్ కింద పడేస్తుంది. ఇంతలో అందరూ వచ్చేస్తారు. ఏంటీ తెలిసిపోయిందా అంటున్నావ్ అని నర్మద అంటే.. యాక్సిడెంట్ గురించి తెలిసిందని కవర్ చేస్తుంది వల్లి. చందుపై ప్రేమ ఒలకబోస్తుంది. డ్రామా ఆపమని చందు అంటాడు. తర్వాత ప్రేమపై కూడా బాగా ప్రేమ ఒలకబోస్తుంది. తల్లిలా దగ్గరుండి ప్రేమ ను చూసుకంటాను అంటుంది.
దెబ్బ తగిలింది కాలుకు కదా. మనిషి మాత్రం గుండ్రాయిలా ఉందన్నాను అని శ్రీవల్లి కవర్ చేస్తుంది. నాకంటే ఎక్కువగా మీ అమ్మను చూసుకోవడం ఇంపార్టెంట్ అని ప్రేమ అంటుంది. తను ఎలాగైనా చూసుకుంటుంది. ఇక్కడే ఉంటాను అని మారం చేస్తుంది శ్రీవల్లి. నర్మదా కూడా తల్లిని చూసుకోవాలి కదా అని అంటుంది. అయినా వల్లి వినదు. చందు కూడా వెళ్లమని తిడతాడు. రామరాజు కూడా వెళ్లమని అంటాడు.
రాత్రి అయింది కాబట్టి చందును దిగబెట్టి రమ్మని రామరాజు చెబుతాడు. దాంతో తను వచ్చిన ప్లాన్ ఫెయిల్ అయిందని శ్రీవల్లి అనుకుంటుంది. ఈ నర్మద ఇక్కడ ఉండగా నీ ఆటలు, మీ అమ్మ కుట్రలు సాగవని చెప్పు అని పంచ్‌లు వేస్తుంది. ప్రేమ కూడా కౌంటర్ ఇస్తుంది. శ్రీవల్లి ఇద్దరిని చూస్తూ కోపంగా వెళ్లిపోతుంది. మరోవైపు చేపల ముక్కలు వేయమని, అందుకోసమే చూస్తున్నా ఆరాటంగా అంటాడు భాగ్యం భర్త.
ధీరజ్ ప్రేమను ఒప్పుకుంటాడా?
మరుసటి రోజు ఉదయం లారీ నెంబర్ ఫ్రెండ్‌కు పంపి డీటేల్స్ కావాలని అడుగుతాడు. అలా ఎంక్వైరీ చేయిస్తున్న ధీరజ్‌ను గట్టిగా అరుస్తూ పిలుస్తుంది ప్రేమ. పక్కన ఉన్న ప్లేట్ ఇవ్వమని అడుగుతుంది. కాసేపు వాదించుకున్నాకా ధీరజే ప్లేట్ ఇస్తాడు. నాకు చేయి నొప్పి తినలేనురా, యాక్సిడెంట్‌లో భుజం పట్టేసింది అని ప్రేమ అంటుంది.
నొప్పి ఉన్నట్లు డ్రామాలు ఆడుతుంది ప్రేమ. దాంతో ప్రేమకు ధీరజ్ టిఫిన్ తినిపిస్తాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మరింత ఉత్కంఠగా మారుతోంది. చందు యాక్సిడెంట్ వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి వేచి చూడండి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


