|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇల్లు ఇల్లాలు పిల్లలు: లారీ డ్రైవర్‌కు సేనాపతి భారీ స్కెచ్! సాగర్‌కు 20 లక్షల టార్చర్!!

Published: 18-04-2026, 1:35 AM
ఇల్లు ఇల్లాలు పిల్లలు: లారీ డ్రైవర్‌కు సేనాపతి భారీ స్కెచ్! సాగర్‌కు 20 లక్షల టార్చర్!!
  • భాగ్యంను కూతురు శ్రీవల్లితోనే కొట్టించిన ధీరజ్.. షాకింగ్ ట్విస్ట్!
  • లారీ డ్రైవర్‌కు డబ్బులిచ్చి పంపించేసిన సేనాపతి.. అసలేం జరుగుతోంది?
  • ప్రేమకు సర్ ప్రైజ్ ఇచ్చిన ధీరజ్.. ఎమోషనల్ సీన్స్ వైరల్!
  • సాగర్‌కు 20 లక్షలు కట్టమని సేటు ఆర్డర్.. నెల గడువు విధించడంతో టెన్షన్!

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. ధీరజ్ ప్లాన్స్, సేనాపతి కుట్రలు, ప్రేమ ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం!

భాగ్యంపై ధీరజ్ పగ.. శ్రీవల్లితో కొట్టింపు!

Illu Illalu Pillalu Serial April 18th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 18వ ఎపిసోడ్‌లో తల్లి భాగ్యంను కూతురు శ్రీవల్లితోనే కొట్టిస్తాడు ధీరజ్. లారీ డ్రైవర్ ఫొటోను ధీరజ్‌కు చూపిస్తుంది నర్మద. దాంతో వెతుకులాట మొదలుపెడతాడు ధీరజ్. కానీ, లారీ డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు సేనాపతి.

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో భాగ్యం కాళ్ల మీద కర్రతో నర్మద తెగ కొడుతూనే ఉంది. నొప్పే లేదు. ఆనంద బాష్పాలు అని భాగ్యం అంటుంది. దాంతో వదిన మీరు బాగా అలసిపోయారు. అయినా అత్తలో చలనం లేదు. అదే పెద్ద వదిన అయితే బలంగా ఉంది. ఆవిడ కొడుతుంది. కర్ర ఇచ్చేయండి అని ధీరజ్ అంటాడు.

డ్రైవర్ గురించి తెలిసింది. ఆర్టీఏ ఆఫీస్‌లో ఎంక్వైరీ చేయించాను అని నర్మద చెబుతుంది. చందుకు యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ఫొటోను ధీరజ్‌కు చూపిస్తుంది నర్మదా. తర్వాత రాత్రి నిద్రపట్టని ధీరజ్ ప్రేమవైపు ప్రేమగా చూస్తాడు. ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ దగ్గరికి తీసుకుని తను పగులగొట్టింది గుర్తు చేసుకుంటాడు. దానికి చాలా ఫీల్ అయిన ధీరజ్ పగిలిపోయిన ముక్కలను అంటిస్తాడు.

లారీ డ్రైవర్‌కు సేనాపతి భారీ ఆఫర్!

దాంతో ఆ గిఫ్ట్ ఎప్పటిలా కనిపిస్తుంది. ఇంతలో లారీ యాక్సిడెంట్ కలలో వచ్చి ప్రేమ ఉలిక్కిపడి లేస్తుంది. ధీరజ్ ఓదారుస్తాడు. ఆ యాక్సిడెంట్ ఎవరో కావాలనే చేశారు. అందుకే అది నన్ను వెంటాడుతుందని ప్రేమ కంగారుగా అంటుంది. అది డైవర్ట్ చేసేందుకు నీకో సర్‌ప్రైజ్ చూపిస్తాను అని తను అతికించిన గిఫ్ట్ చూపిస్తాడు. అది చూసి ప్రేమ చాలా సంతోషిస్తుంది. ఎమోషనల్ అవుతుంది ప్రేమ . జరిగినదానికి ధీరజ్ సారీ చెబుతాడు.

మరుసటి రోజు ఉదయం లారీ డ్రైవర్‌ను కొట్టి ఆ అమ్మాయిని ఎందుకు గుద్దావురా అని సేనాపతి తిడతాడు. నా తప్పు ఏం లేదు. ఆ అమ్మాయే సడెన్‌గా వచ్చిందని లారీ డ్రైవర్ అంటాడు. ఆ అమ్మాయికి ఏం కాలేదు కాబట్టే బతికిపోయావని సేనాపతి అంటాడు. మరోవైపు లారీ డ్రైవర్ ఫొటోను తన ఫ్రెండ్స్‌కు చూపించి వాడిని పట్టుకోవాలని ధీరజ్ చెబుతాడు. ఇంకోవైపు నీకోసం ఎవరైనా వెతక్కుంటూ వస్తే నేను దొరికిపోతాను. వెంటనే వేరే స్టేట్‌కు వెళ్లిపో అని లారీ డ్రైవర్‌కు డబ్బు ఇస్తాడు సేనాపతి.

ఒకవేళ నువ్వు దొరికి నా పేరు గనుక బయటకొచ్చిందే అదే నీకు చివరి రోజు అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి వేరే రాష్ట్రానికి వెళ్లమని చెప్పి వెళ్లిపోతాడు సేనాపతి. మరోవైపు తన ఫ్రెండ్స్‌కు లారీ డ్రైవర్‌ను పట్టుకోమ్మని ధీరజ్ చెబుతాడు. ఇంకోవైపు నర్మదకు నగల షాపు సేటు కాల్ చేసి సాగర్ చూపించిన పొగరు, బలుపు గురించి చెబుతాడు. సాగర్ డబ్బులు విసిరికొట్టింది, రామరాజు కు చెప్పినదాని గురించి సాగర్ గొడవ పడింది చెబుతాడు సేటు.

ప్రేమకు ధీరజ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఎమోషనల్!

నెల రోజుల్లో ఎలా ఇస్తానని సాగర్ అంటాడు. ఇప్పటికే చాలా మాట్లాడావ్. నెలరోజుల్లో నా 20 లక్షలు ఇవ్వకుంటే మర్యాదగా ఉండదు వెళ్లు అని తిట్టి పంపిస్తాడు సేటు. దాంతో సాగర్ సైలెంట్‌గా వెళ్లిపోతాడు. అదంతా నర్మదకు చెబుతాడు సేటు. ఉద్యోగం ఉందన్న పొగరుతో అలా చేశాడు. సరిగ్గా నెల రోజుల్లో అప్పు తీర్చాలి అని సేటు కాల్ కట్ చేస్తాడు. లోన్ అప్లై చేస్తుంటే రెజెక్ట్ అవుతుంది. నెల రోజుల్లో 20 లక్షల అప్పు ఎలా తీర్చాలి అని నర్మద కంగారుపడుతుంది.

రోడ్ మీద వెళ్తున్న ధీరజ్‌కు ఎస్సై ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయని తెలుస్తుంది. దాంతో వెళ్లి ప్రేమ హాల్ టికెట్ నెంబర్ చెప్పి చెక్ చేయిస్తాడు ధీరజ్. కానీ, ప్రేమ ఫెయిల్ అయిన వాళ్లలో లాస్ట్ ప్లేసులో ఉందని ఇంటర్నెట్ షాప్ అతను చెబుతాడు. దాంతో పులిహార చేసేశావు కదే అని తిట్టుకుంటాడు ధీరజ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రానున్న ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.