|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇల్లు ఇల్లాలు పిల్లలు: చందుకు ప్రమాదం! భాగ్యం ప్లాన్ మామూలుగా లేదుగా!!

Published: 07-04-2026, 12:35 AM
ఇల్లు ఇల్లాలు పిల్లలు: చందుకు ప్రమాదం! భాగ్యం ప్లాన్ మామూలుగా లేదుగా!!
  • చందుపై భాగ్యం, వల్లి కుట్ర: యాక్సిడెంట్ ప్లాన్!
  • భాగ్యం ప్లాన్ విని షాకైన వల్లి.. భర్తపై ప్రేమ!
  • రామరాజు ఇంట్లో గొడవలు.. సాగర్ సంచలన నిర్ణయం!
  • నర్మదకు సాగర్ షాక్.. నేను ఇంట్లో ఉండను అంటాడు!

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేక్షకులకు ఒక షాకింగ్ న్యూస్! భాగ్యం మరియు వల్లి కలిసి చందును అంతమొందించడానికి ఒక భయంకరమైన ప్లాన్ వేశారు. ఈ సీరియల్ లో ఏం జరగబోతుందో చూడండి!

భాగ్యం కుట్ర: చందుకు యాక్సిడెంట్ ప్లాన్!

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో చందు భార్య గురించి ఆలోచిస్తూ తప్ప తాగుతాడు. ఇంటికి వచ్చాక రామరాజుకు ఎలాగైనా తన భార్య గురించి చెప్పాలనుకుంటాడు. కానీ ప్రేమ, నర్మద చెప్పకుండా అడ్డుకుంటారు. చందుని తిరుపతి, ధీరజ్ కలిసి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే సాగర్ కి కోపం వస్తుంది. పెద్దకొడుకు అంటే ఎంత ఇష్టమో, అదే నేను అలా తప్ప తాగి వస్తే ఇంట్లోకి కూడా రానిచ్చే వాళ్ళు కాదు.. అంటూ రామరాజుని నానా మాటలు అంటాడు. ధీరజ్‌కి ఆ మాటలు విని కోపం వచ్చి నాన్నని ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోను అని అంటాడు. అన్నదమ్ములు ఇద్దరు మధ్య గొడవ జరుగుతుంది. అందరూ కలిపి ఆపేందుకు ప్రయత్నిస్తారు. రామరాజు ఆ గొడవలో కోపంలో తిరుపతిని కొడతాడు. దాంతో గొడవ ఆగిపోతుంది. సాగర్ ఆవేశంగా ఇంట్లోకి వెళ్తాడు. వెనకే నర్మద కూడా వెళుతుంది.

నర్మదా సాగర్ తో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావ్ నీకు బుద్ధుందా? డబ్బులు పెట్టి జాబుకు అన్నది నువ్వు అందుకే మావయ్య గారు నేను తిట్టారు అని నర్మదా అడుగుతుంది దానికి సాగరు ఆమె చెప్పిన మాట వినిపించుకోకుండా నువ్వు చేసినా మీ మామయ్య చేసిన ఏది తప్పు కాదు అది నేను చేస్తే మాత్రం తప్పు అమ్మ పుట్టింటి నుంచి అమ్మ ఇంటికి వచ్చాక నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు వెళ్లిపోవాల్సిందే అంటాడు సాగర్ దాంతో నర్మదా షాక్ అవుతుంది.

షాక్ లో వల్లి.. భర్తపై ప్రేమ!

ఇక ఇక్కడి నుంచి ఎపిసోడ్ భాగ్యం దగ్గరికి మారుతుంది. తన కూతుర్ని ఎలాగైనా అల్లుడితో కలిపేందుకు నీచమైన ప్లాన్ వేస్తుంది. భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావు భాగ్యం కలిసి హడావిడిగా వెళుతూ ఉంటారు. ఒక వ్యక్తిని కలిసి చందుకి యాక్సిడెంట్ చేయాలని చెబుతుంది భాగ్యం. దాంతో ఒక్కసారిగా వల్లి షాక్ అవుతుంది. ‘ఏ మనిషివే నువ్వు. నా మొగుడికి యాక్సిడెంట్ చేయమని చెప్తావేంటి’ అని అంటుంది. అప్పుడు భాగ్యం ‘భర్తకు ఏదైనా జరిగితే భార్య దగ్గరుండి సేవలు చేయాలి కదా అప్పుడు నేను ఇంట్లోకి రానిస్తారు కదా. అది ప్లాను’ అని చెబుతుంది. అప్పుడు వల్లీ ‘సరే అయితే కాస్త కొంచెం మెల్లగా దెబ్బలు తగిలేలా చూడమను. ఆయనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఆయన అంటే నాకు ప్రాణం’ అని అంటుంది వల్లి. ఇక చందకి యాక్సిడెంట్ చేసేందుకు భాగ్యం ఆ వ్యక్తితో మాట్లాడుతుంది.

ఇంట్లో గొడవలు.. సాగర్ సంచలన నిర్ణయం!

ఇక్కడి నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. ప్రేమ కాఫీ పెడుతూ ఉంటే మీ ఇద్దరిలాగే వల్లీ వదిన కూడా ఇంట్లోనే ఉంటే బాగుండేది.. నాకేం చేయాలో అర్థం కావడం లేదని బాధపడుతుంది అమూల్య. ఈలోపు రామరాజు నర్మద కాఫీ కావాలమ్మా అని అంటాడు. అప్పుడు అమూల్య కాఫీ పట్టుకొని వస్తుంది. కాఫీ తాగగానే అందరూ మెచ్చుకుంటారు. కాఫీని నర్మదా చేసిందనుకొని ధీరజ్ ‘కాఫీ మా అమ్మలాగా చేయకపోయినా పర్వాలేదు అంతా ఇంతో మా అమ్మలాగే చేశావు వదిన’ అంటాడు. దానికి అమూల్య మాట్లాడుతూ కాఫీ చేసింది మీ వదిన కాదు మీ ఆవిడ అని అంటుంది. దాంతో ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక చందుకి యాక్సిడెంట్ చేస్తారా లేదా భాగ్యం ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా అనేది రేపు చూడాలి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రానున్న ఎపిసోడ్స్ మరింత ఉత్కంఠగా ఉండనున్నాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.