|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హాట్ ఫొటోల వెనుక డిప్రెషన్‌ దాస్తున్న ఇనాయా సుల్తానా? బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ సీక్రెట్!

Published: 30-12-2025, 6:19 AM
హాట్ ఫొటోల వెనుక డిప్రెషన్‌ దాస్తున్న ఇనాయా సుల్తానా? బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ సీక్రెట్!
  • బిగ్‌బాస్ ద్వారా ఇనాయా సుల్తానాకు విశేష పాపులారిటీ లభించింది.
  • సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఫాలోయింగ్ పెంచుకుంది.
  • బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌తో డిప్రెషన్‌లో ఉన్న ఇనాయా.
  • డిప్రెషన్ నుండి బయటపడటానికి జిమ్, శరీర మార్పు సంతృప్తే కారణం.

బిగ్‌బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా తన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రేకప్ కారణంగా డిప్రెషన్‌లో ఉన్నానని, దాన్ని అధిగమించడానికి జిమ్‌లో శ్రమిస్తున్నానని చెప్పింది. తను పోస్ట్ చేసే హాట్ ఫొటోల వెనుక ఉన్న నిజమైన కారణాన్ని కూడా బయటపెట్టింది.

బిగ్‌బాస్ ఇనాయా: పాపులారిటీ నుండి డిప్రెషన్ వరకు

బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వారిలో ఇనాయా సుల్తానా(Inaya Sultana) ఒకరు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఈ భామకు ఊహించని విధంగా ఫేమ్ రావడంతో సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేసి మరింత ఫాలోయింగ్‌ను రాబట్టుకుంది. అంతేకాకుండా పలు షోస్‌లో పాల్గొన్న ఆమె పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సమయంలోనూ గౌతమ్ (Gautam)అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంపాటు.. ప్రేమలో ఫుల్ ఎంజాయ్ చేసిన ఇనాయా సుల్తానాపై ఊహించని దెబ్బ పడింది. బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో బ్రేకప్ చెప్పేశాడు.

బ్రేకప్ బాధ… ఒంటరిగా ఇనాయా జీవితం

దీంతో కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్న ఇనాయా ఆ బాధను తట్టుకోలేకపోతుంది. నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన బాధను వ్యక్త పరుస్తోంది. అలాగే తాను నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలు షేర్ చేయడానికి కారణం ఏంటో కూడా చెప్పింది. నేను డిప్రెషన్‌‌ను అధిగమించడానికి కొత్త విషయాలను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. జిమ్ నా జీవితంలో ఉన్న ఒకే ఒక సంతోషానిచ్చే పని. డబ్బుతో ప్రపంచంలో ఏదైనా కొనవచ్చు.. కానీ శరీరాన్ని కొనలేమని, మార్చలేమని చెప్పింది. జిమ్‌లో కష్టపడి శరీరాన్ని మార్చుకోవడం వల్ల లభించే సంతృప్తి చాలా గొప్పది. అందుకే నేను నిత్యం జిమ్ ఫొటోలు షేర్ చేస్తానని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. నీలాంటి వాళ్ల గురించే శివాజీ చెప్పిందని ఇప్పటికైనా మారాలని సలహాలు ఇస్తున్నారు.

హాట్ ఫొటోల వెనుక రహస్యం: జిమ్ సంతృప్తి!

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

మొత్తానికి, ఇనాయా సుల్తానా తన జీవితంలోని కష్టాలను జిమ్ ద్వారా అధిగమిస్తూ, శరీరాన్ని మార్చుకోవడం ద్వారా గొప్ప సంతృప్తిని పొందుతోందని వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.