
📌 Key Points
- షారుఖ్ ఖాన్ రూ.12,931 కోట్లతో ఇండియాలో అత్యంత ధనవంతుడైన నటుడిగా అగ్రస్థానంలో నిలిచారు.
- టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రూ.5,000 కోట్లతో అత్యధిక ధనవంతుల జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.
- సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా టాప్ 10లో భాగమయ్యారు.
- నటులు రెమ్యూనరేషన్, రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, బ్రాండ్ అంబాసిడర్‌గా ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు.
భారతీయ స్టార్ హీరోలు తమ అద్భుతమైన రెమ్యూనరేషన్‌తో పాటు వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. అత్యధిక ధనవంతుల జాబితాలో ఎవరున్నారు? టాలీవుడ్ హీరోల స్థానం ఏమిటి? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూడండి.
భారతదేశంలో నెంబర్ 1 ధనవంతుడైన నటుడు ఎవరు?
Richest Actor’s: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా సంపాదనలో కూడా మొదటి స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి సెలబ్రిటీలకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి ప్రమోషనల్ కంటెంట్ తో మరింత ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతూ మరొకవైపు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అంతేకాదు కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మరింత ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.అలా గడిచిన ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ధనవంతులుగా నిలిచిన టాప్ టెన్ సెలబ్రిటీస్ ఎవరు? వారిలో టాలీవుడ్ హీరోల స్థానం ఎంత? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ దేశంలోనే అత్యధిక ధనవంతుడి జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈయన నికర ఆస్తుల విలువ రూ.12,931 కోట్లు. ఇండియాలోనే కాదు ఆసియాలో కూడా అత్యధిక ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించుకొని రికార్డ్ సృష్టించారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మన్మధుడిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున.. రూ.5వేల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. అంతేకాదు అత్యధిక ధనవంతుల జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.
బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ రూ.3,325 కోట్లు సొంతం చేసుకొని.. అత్యధిక ధనవంతుల జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు.
టాప్ 10లో టాలీవుడ్ స్టార్స్ స్థానం ఏమిటి?
బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. తన నటనతో తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ హీరోగా కూడా మారిపోయారు. ఈయన రూ.3,100 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. అలా అత్యధిక ధనవంతుల జాబితాలో నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఒకవైపు బాలీవుడ్ లో హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న అక్షయ్ కుమార్.. ఇటు సౌత్ చిత్రాలలో విలన్ పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. ఈయన 2,250 కోట్లు సంపాదించి ఐదవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఒకవైపు హీరోగా.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్న అమీర్ ఖాన్ ఈమధ్య సొంత నిర్మాణ సంస్థ ద్వారా పలు చిత్రాలు నిర్మిస్తూ.. భారీగా ఆదాయాన్ని దక్కించుకుంటున్నారు. ఈయన 1,860 కోట్లు సంపాదించారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ధనవంతుల జాబితాలో ఆరవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం కోసం ఏకంగా రూ.75 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే ఇన్నేళ్ల సినీ కెరియర్లో రూ.1750 కోట్ల సంపాదన కలిగి ఉన్నారు చిరంజీవి.
అగ్ర నటుల నికర ఆస్తులు, సంపాదన వివరాలు
బాలీవుడ్ బిగ్ బీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ ఒకవైపు హీరోగా మరొకవైపు నటుడిగా ఇంకొక వైపు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈయన రూ.1680 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.
ఇకపోతే ఆ తర్వాత స్థానాలలో వెంకటేష్ రూ.1650 కోట్లు సంపాదించి తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకోగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రూ.1630 కోట్లు కలిగి ఉండి పదవ స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఈ జాబితాలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా స్థానం సంపాదించుకోవడం విశేషం.
భారతీయ సినీ తారలు కేవలం సినిమాల ద్వారానే కాకుండా వివిధ మార్గాల్లో భారీ సంపదను కూడబెడుతున్నారు. ఈ టాప్ 10 జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలవగా, టాలీవుడ్ నుండి నాగార్జున వంటి స్టార్లు కూడా తమ సత్తా చాటారు.


