|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండిగో పగ్గాలు ఇక విలియం వాల్ష్ చేతిలో! కొత్త సీఈవోతో సంస్థ దశ మారుతుందా?

Published: 31-03-2026, 7:35 AM
ఇండిగో పగ్గాలు ఇక విలియం వాల్ష్ చేతిలో! కొత్త సీఈవోతో సంస్థ దశ మారుతుందా?
  • ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్ నియమితులయ్యారు.
  • విలియం వాల్ష్ గతంలో బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చీఫ్‌గా పనిచేశారు.
  • గతంలో ఇండిగో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది, దీనిపై విమర్శలు వచ్చాయి.
  • ప్రస్తుతం ఇండిగో దేశీయ విమానయాన రంగంలో 63 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.

భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ మాజీ చీఫ్‌గా పనిచేసిన వాల్ష్ రాకతో ఇండిగోలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

విలియం వాల్ష్: కొత్త సీఈవో ప్రొఫైల్

భారతదేశంలో అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈవో)గా విలయం వాల్ష్ నియమితలయ్యారు. బ్రిటీషన్ ఎయిర్ వేస్ మాజీ చీఫ్ గా పని చేసిన విలయం వార్ష్ తమ తదుపరి సీఈవోగా నియమించుకుంది. ఈయన ప్రస్తుతతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ (IATA) డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇండిగో తాత్కాలిక సీఈవోగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా బాధ్యతలు నిర్వర్తించగా అంతకు ముందు ఈ పదవిలో పీటర్ ఎల్బర్స్ కొనసాగారు.

ఇండిగోలో గత వైఫల్యాలు, విమర్శలు

పీటర్ ఎల్బర్స్ సారథ్యంలో ఇండియా వరుస వైఫల్యాలతో తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుంది.గతేడాది ఈ పీటర్ ఎల్బర్స్ నేతృత్వంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపెట్టింది. వందలాది ఫ్లైట్లు రద్దు చేసి ప్రత్యక్ష నరకం చూపింది. ఈ పరిణామంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) విచారణ జరుపుతూ, చర్యలకు ఉపక్రించింది. నేపథ్యంలో ఆయన ఇండిగో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఎల్బర్స్‌ తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ, తన నోటీసు కాలాన్ని మినహాయించాలని కోరారు. అయితే తన రాజీనామా నుంచి ఎండీ రాహుల్‌ భాటియా తాత్కాలికంగా సీఈఓ బాధ్యతలూ చేపట్టారు.

దేశీయ విమానయాన రంగంలో ఇండిగో ఆధిపత్యం

2005లో ప్రారంభమైన ఇండిగో ఆ మరుసటి ఏడాదిలోనే కార్యకలాపాలను మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆ కంపెనీ వద్ద 434 విమానాలు ఉండగా ప్రపంచ వ్యాప్తంగా 128 నగరాలకు రోజూ 2,300 సర్వీసులను ఆ సంస్థ నడుపుతోంది. దేశీయ వైమానిక రంగ మార్కెట్ వాటాలో 63 శాతం ఇండిగోదే. అంటే ఈ రంగంలో ఇండిగోది స్పష్టమైన గుత్తాధిపత్యం కనిపిస్తోంది. ఈ పరిస్థితి సరికాదని నిపుణులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అయితే కొత్త సీఈవో రాకతో సంస్థ సేవల్లో మెరుగుదల కనిపిస్తుందా లేక పాత సంప్రతాయాలతోనే ముందుకు వెళ్తుందా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.

కొత్త సీఈవో రాకతో ఇండిగో సేవల్లో మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. సంస్థ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.