
నీట్ (NEET-UG 2026) రీ ఎగ్జామ్ నేపథ్యంలో అక్రమాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ (Telegram) యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ (Pavel Durov) నిషేధంపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన అసలు సూత్రధారులను వదిలేసి, కొందరు వినియోగదారులు లీక్డ్ మెటీరియల్‌ను షేర్ చేశారనే నెపంతో ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌ను వారం రోజుల పాటు నిషేధించిందని అన్నారు. ఈ నిర్ణయం కారణంగా భారతదేశంలోని 15 కోట్ల మంది సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులు అనవసరంగా శిక్షకు గురవుతున్నారు. ఈ నిషేధం వల్ల లీకేజీలు ఏమీ ఆగవని, ఆ లీక్‌లు కాస్తా ఇప్పుడు ఇతర యాప్‌లలోకి మారిపోతాయని పావెల్ దురోవ్ కామెంట్ చేశారు.


