|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘నీట్’ విద్యార్థి బలన్మరణం.. స్పాట్‌లో సూసైడ్ నోట్ లభ్యం

Published: 16-06-2026, 5:00 PM
‘నీట్’ విద్యార్థి బలన్మరణం.. స్పాట్‌లో సూసైడ్ నోట్ లభ్యం

వైద్య విద్య సీటు కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన రాజస్థాన్‌ (Rajasthan)లోని సికార్ (Sikar) జిల్లాలో వెలుగుచూసింది. నీట్ (NEET) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న 22 ఏళ్ల ఉమేష్ అనే అభ్యర్థి తను ఉంటున్న ప్రైవేటు గదిలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే, నీట్ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న ఉద్యోగ్ నగర్ (Udyog Nagar) పోలీసులు వెంటన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విద్యార్థి గదిలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘నేను చాలా దూరంగా వెళ్లిపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు.. క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసినట్లుగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల సంక్షోభం, యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.