
📌 Key Points
- నటి ఇంద్రజ అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
- పబ్లిక్ లో డీసెంట్ గా ఉండాలని, ఇంట్లో ఉన్నట్టు పబ్లిక్ లో ఉండకూడదని తెలిపారు.
- కొన్ని డ్రెస్ లు చూస్తే అవి ఎప్పుడు జారిపోతాయో అని భయం వేస్తుందని పేర్కొన్నారు.
- సెలబ్రిటీలు తమను చూసి ఫాలో అయ్యేవారు ఉన్నారని గుర్తుంచుకోవాలని సూచించారు.
ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ షోలతో అలరిస్తున్నారు. తాజాగా ఆమె అమ్మాయిలు వేసుకునే డ్రెస్సుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ లో డీసెంట్ గా ఉండాలని, వల్గర్ డ్రెస్ లు వేస్తే కామెంట్స్ వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇంద్రజ వైరల్ కామెంట్స్ వెనుక అసలు విషయం
Indraja : ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తుంది. మరో పక్క జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఇంద్రజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిలు వేసుకునే డ్రెస్ ల గురించి కామెంట్స్ చేసారు.(Indraja)
ఇంద్రజ మాట్లాడుతూ.. నా ఇష్టం.. నేను నాకు నచ్చిన డ్రెస్ వేసుకున్నాను, నువ్వు ఎవరు దాని గురించి కామెంట్ చేయడానికి, నువ్వెవరు అనడానికి అని ప్రశిస్తున్నారు. నువ్వు నీ ఇష్టం అని పబ్లిక్ గా బట్టలు వేసుకొని రావడం, పబ్లిక్ మీడియాలో లో నీ ఫోటోలు, వీడియోలు పెట్టడం నీకు ఎంత హక్కు ఉంది అంటున్నావో నువ్వేసుకున్న డ్రెస్ అభ్యంతకరంగా, వల్గర్ గా ఉన్నప్పుడు దాని గురించి కామెంట్ చేసే హక్కు కూడా వాళ్ళకే ఉంటుంది. పబ్లిక్ లో ఎలా ఉండాలి అని ఒకటి ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లో మాట్లాడినట్టు పబ్లిక్ లో ఉండదు, ఉండకూడదు. పబ్లిక్ లో ఎలా ఉండాలి అని ఒక కోడ్ ఉంటుంది. లేదు అది నీ ఇష్టం నేను వేసుకుంటాను అంటే ఓకే కానీ వేసుకున్నాక కామెంట్స్ చేయొద్దు అనే రైట్ నీకు లేదు.
వల్గర్ డ్రెస్సింగ్ పై ఇంద్రజ అభిప్రాయం
అసభ్యకరంగా బట్టలు వేయకండి పబ్లిక్ లో. మీ పర్సనల్ స్పేస్ లో వేసుకోండి. కానీ పబ్లిక్ లో వేస్తే కామెంట్స్ చేస్తారు. అది తీసుకోడానికి రెడీ అయితేనే వేసుకోండి, అలా ఉండండి లేకపోతే వేసుకోవద్దు. చాలా సార్లు కొంతమంది డ్రెస్ లు చూసి అబ్బా ఇవేమి డ్రెస్ లు అని, అవి ఎప్పుడు జారిపోతాయో అని భయం వేస్తుంది. అలాంటి కాస్ట్యూమ్స్ లో వాళ్ళు కంఫర్ట్ గా ఎలా ఉంటారు అనిపిస్తుంది. కొంతమందిని చూసి మాములు జనాలు ఫాలో అవుతారు, మన పిల్లలు పాడయిపోతారు అనే భయం ఉంటుంది.
సెలబ్రిటీలు, డ్రెస్సింగ్ కోడ్
అందంగా ఉండాలి, ట్రెండింగ్ గా ఉండాలి కానీ ఛీ అనేలా, మన అవయవాలు కనపడేలా ఉండకూడదు మన కాస్ట్యూమ్స్. సెలబ్రిటీలు ఈ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి. మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు కాబట్టి. డ్రెస్సులు వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయా అంటే కాదు కానీ పబ్లిక్ లో జనాల మధ్యలో ఉన్నప్పుడు డీసెంట్ గా ఉండాలి. మనల్ని ట్రీట్ చేసే విధానం మన బట్టల్లో కూడా ఉంటుంది అని తెలిపింది. దీంతో ఇంద్రజ కామెంట్స్ వైరల్ గా మారాయి.
మొత్తంగా, పబ్లిక్ లో డ్రెస్సింగ్ విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుందని ఇంద్రజ తన వ్యాఖ్యలతో తెలిపారు. సెలబ్రిటీలు ఆదర్శంగా ఉండాలని ఆమె సందేశం స్పష్టం చేస్తుంది. ఈ కామెంట్స్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది.

