|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇంటర్నేషనల్ డ్రాగన్ (ఎన్టీఆర్)

Published: 02-09-2025, 6:46 PM
ఇంటర్నేషనల్ డ్రాగన్ (ఎన్టీఆర్)

ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘డ్రాగన్’ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా విదేశీ షూటింగ్ తో భారీ ఎత్తున తెరకెక్కనుంది.

Key Points

1

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'డ్రాగన్' సినిమా

2

అక్టోబర్ లో విదేశాల్లో షూటింగ్ ప్రారంభం

4

2026 జూన్ 25న సినిమా విడుదల

‘డ్రాగన్’ సినిమా విదేశీ షూటింగ్

‘డ్రాగన్‌’ రేంజ్‌ గ్లోబల్‌ లెవల్లో ఉంటుందట. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమా ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ కొత్త ప్రపంచం

అక్టోబరులో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ విదేశాల్లోప్రారంభం అవుతుందని, ఈ దిశగా చిత్రయూనిట్‌ ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అంతేకాదు… తన గత చిత్రాలు ‘కేజీఎఫ్‌’లో ‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌’, ‘సలార్‌’లో ఖాన్సార్‌ప్రాంతాలు ఉన్నట్లే ‘డ్రాగన్‌’ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌.

విడుదల తేదీ వివరాలు

‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్, ఖాన్సార్‌’ల ప్రస్తావన ఇండియా వైడ్‌గా ఉంటే, ‘డ్రాగన్‌’ చిత్రం కోసం ప్రశాంత్‌ నీల్‌ సృష్టిస్తున్న ప్రపంచానికి ఇంటర్‌ నేషనల్‌ టచ్‌ ఉంటుందట. ఇందుకోసమే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందని భోగట్టా. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టీ–సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్‌ 25న విడుదల కానుంది.

చివరగా, ‘డ్రాగన్’ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 2026 జూన్ 25న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.