
“స:కుటుంబానాం” సినిమా టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ డ్రామాతో పాటు కొత్త విషయాలను చూపించడం టీజర్ ప్రత్యేకత. రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Key Points
“స:కుటుంబానాం” టీజర్ అద్భుతమైన విజువల్స్ మరియు డైలాగ్స్‌తో ఆకట్టుకుంటుంది.
రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్ లాంటి నటీనటుల నటన ఆకట్టుకుంటుంది.
సత్య, బ్రహ్మానందం గారి హాస్యం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.
అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ తో పాటు కుటుంబ కథా చిత్రంగా కూడా ఆకర్షిస్తుంది.
టీజర్ లోని ఆకర్షణీయమైన అంశాలు
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీనీ హేట్ చేస్తూ కనిపించిన ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులని అలరించబోతున్నారు.
ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం గారి హాస్యం చిత్రంలో బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఒక మార్క్ సృష్టిస్తారు నడిపించేలా తన ప్రెసెన్స్ & పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని ఈ చిత్ర టీజర్ అనిపిస్తుంది. టీజర్ లోని సంగీతం చాలా బాగుంది.
నటీనటుల ప్రదర్శన
కథా చిత్రం ప్రత్యేకత
మొత్తం మీద, “స:కుటుంబానాం” టీజర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. కొత్త కథాంశం, నటీనటుల ప్రదర్శన, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.


