|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐఫోన్ 15 సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? 22 వేల భారీ తగ్గింపుతో ఈ బంపర్ ఆఫర్ మిస్ కావద్దు!

Published: 30-04-2026, 8:48 PM
ఐఫోన్ 15 సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? 22 వేల భారీ తగ్గింపుతో ఈ బంపర్ ఆఫర్ మిస్ కావద్దు!
  • ఐఫోన్ 15 లాంచ్ ధర రూ. 79,999 కాగా, ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ. 57,900కే లభ్యం.
  • నేరుగా రూ. 22,099 తగ్గింపుతో పాటు HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,500 అదనపు డిస్కౌంట్.
  • A16 బయోనిక్ చిప్, 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, 48MP కెమెరా, IP68 రేటింగ్ వంటి ఫీచర్లు.
  • నెలకు రూ. 2,688 నుంచి EMI ఆప్షన్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై మరింత తగ్గింపు పొందవచ్చు.

Apple iPhone 15 కొనుగోలు చేయాలనుకునేవారికి విజయ్ సేల్స్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. రూ. 79,999 లాంచ్ ధరతో వచ్చిన ఈ ఐఫోన్, ఇప్పుడు రూ. 22,099 భారీ తగ్గింపుతో కేవలం రూ. 58వేలలోపు లభిస్తోంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ఆఫర్ వివరాలు

Apple iPhone 15 : ఐఫోన్ లవర్స్ మీకో గుడ్ న్యూస్.. తక్కువ ధరలో కొత్త ఐఫోన్ కావాలా? రూ. 79,999 ధరకు లాంచ్ అయిన ఐఫోన్ 15 ఇప్పుడు విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ లేదా కార్డ్ ఆఫర్లతో భారీ తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు.

2023లో లాంచ్ అయినా ఇప్పటికీ అద్భుతమైన ఐఫోన్ మోడల్. ఇప్పుడు (Apple iPhone 15) కేవలం రూ. 58వేల లోపు ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, A16 బయోనిక్ చిప్‌సెట్ ఉన్నాయి. ఇందులో 6.1-అంగుళాల OLED ప్యానెల్ కూడా ఉంది. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ధర : ఆపిల్ ఐఫోన్ 15 ఫస్ట్ రూ. 79,999 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ. 57,900కే లభిస్తోంది. ఈ ఐఫోన్ రూ. 22,099 నేరుగా తగ్గింపు అందిస్తోంది. కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ధరను రూ. 3,500 వరకు తగ్గించుకోవచ్చు. తద్వారా అసలు ధర ఇంకా తగ్గించుకోవచ్చు.

ఐఫోన్ 15 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Read Also : WhatsApp Backup : పండగ చేస్కోండి.. గూగుల్ డ్రైవ్‌కు గుడ్‌బై? ఇక వాట్సాప్‌లోనే ‘చాట్ బ్యాకప్’ కొత్త ఫీచర్..!

ఈఎంఐలో ఈ ఐఫోన్‌ కొంటే.. నెలకు రూ. 2,688 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. విజయ్ సేల్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ కూడా అందిస్తోంది. ఇందులో పాత స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఇంకా తక్కువ ధరకే ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 15లో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. తద్వారా నేరుగా సూర్యరశ్మిలో కూడా ఈజీగా స్క్రీన్ చూడొచ్చు.

ఐఫోన్ 15 కొనుగోలు చేయాలా?

ఈ ఫోన్ A16 బయోనిక్ చిప్‌తో వస్తుంది. వీడియోలు చూసినా 26 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, అలాగే 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. అదనంగా, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ కూడా ఉంది.

ఆపిల్ ఐఫోన్ 15 కొనాలా? వద్దా? : మీరు 2026లో కొత్త ఐఫోన్ 15 కొనాలకుంటే.. మీది బెస్ట్ ఛాయిస్.. ఎందుకంటే.. ఇప్పటివరకూ కూడా ఆ ఐఫోన్ ధరకు తగ్గ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఐఫోన్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. కెమెరాలు కూడా కిర్రాక్ ఉంటాయి. చాలా ఏళ్ల పాటు సాఫ్ట్ వేర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి. అందుకే ఈ ఐఫోన్ కొనడం చాలా బెటర్.

మొత్తంగా, Apple iPhone 15ను ఇప్పుడు కొనుగోలు చేయడం బెస్ట్ ఛాయిస్. ఈ భారీ తగ్గింపు, అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఐఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని ఐఫోన్ లవర్స్ మిస్ చేసుకోకూడదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.