|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భారత్‌కు ఇరాన్ భారీ ఊరట: యుద్ధం మధ్య చమురు దిగుమతులకు గ్రీన్ సిగ్నల్!

Published: 05-03-2026, 4:35 AM
భారత్‌కు ఇరాన్ భారీ ఊరట: యుద్ధం మధ్య చమురు దిగుమతులకు గ్రీన్ సిగ్నల్!
  • హార్మూజ్ జలసంధిని నియంత్రించే అధికారం ఇరాన్‌కు ఉందని ప్రకటన
  • అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ నౌకలకు మాత్రం రవాణా నిలిపివేత
  • భారత్ సహా పలు దేశాలకు చమురు సరఫరాకు అనుమతి
  • యుద్ధం కారణంగా మూతపడిన జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ఊరట

ప్రపంచ దేశాలకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిని తమ ఆధీనంలో ఉంచుకున్నామని, కొన్ని దేశాలకు మాత్రమే రవాణా నిలిపివేస్తున్నామని తెలిపింది. దీని ద్వారా భారత్‌కు చమురు దిగుమతి విషయంలో ఊరట లభించనుంది.

హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటన

ప్రపంచ దేశాలకు చమురు సహా ఇతర ముఖ్యమైన వస్తురవాణా మార్గంగా ఉన్న హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిని నియంత్రించే అధికారం మాకు ఉందని స్పష్టం చేసింది. తాజా పరిస్థితుల దృష్ట్యా అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయాలనుకోవడం లేదని కేవలం యూఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు మాత్రం ఈ మార్గంలో వెళ్లనివ్వబోమని మిగతా దేశాలకు రవాణాకు అనుమతి ఇస్తామని పేర్కొంది. ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు భారీ ఊరటగా మారనుంది.

ఇరాన్‍‍పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన మార్గాన్ని ఇరాన్ నిలిపివేసింది. తమ ఆదేశాలను ధిక్కరించి జలసంధి దాటేందుకు ప్రయత్నింస్తే అలాంటి నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో వందలాది నౌకలు ఎక్కడిక్కడ సముద్రంలోనే నిలిచిపోయాయి. అయితే యుద్ధం మొదలై ఐదు రోజులు అవుతుండగా ఈ మార్గం మూసివేతతో ఆయా దేశాలు చమురు దిగుమతి విషయంలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఓ వైపు యుద్ధం తీవ్ర తరం అవుతుండగా దేశీయంగా మరో వైపు చమురు నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ ఊరట కలిగించనుంది.

భారత్‌కు చమురు సరఫరాలో వెసులుబాటు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట

ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశాలకు ఊరటనిచ్చే అంశం. ఆర్థికంగా కూడా ఇది కొంత మేలు చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.