
📌 Key Points
- హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ ఛార్జీలు విధించే ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది.
- యుద్ధం తర్వాత హార్ముజ్ జలసంధికి కొత్త నిబంధనలు వస్తాయని ఇరాన్ తెలిపింది.
- తమపై ఆంక్షలు విధించిన దేశాలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది.
- అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ మరియు ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ ఛార్జీలు విధించే అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల నౌకలకు ప్రవేశం నిరాకరించింది.
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 19 రోజులుగా ఈ మూడు దేశాల మధ్య వార్ భయంకరంగా సాగుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీ లాంటి వాళ్లు చనిపోయినా ఇరాన్ తగ్గడం లేదు. ఇక ఈ యుద్ధం నేపథ్యంలో చాలా దేశాల్లో చమురు కొరత ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసిన నేపథ్యంలో నౌకలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇండియా లాంటి కొన్ని దేశాలకు చెందిన నౌకలు హర్మూజ్ జలసంధి గుండా సాఫీగా వెళుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా లాంటి శత్రుదేశాలకు సంబంధించిన నౌకలకు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇరాన్.
యుద్ధం భయంకరంగా సాగుతోన్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపైన హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించాలంటే, కొంత మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన ఓ సభ్యుడు కూడా మీడియా ముందు ఈ ప్రకటన చేశాడు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ విధించాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు ఆయన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
టోల్ ఫీజు ప్రతిపాదన పరిశీలనలో ఉంది
యుద్ధం ముగిసిన తర్వాత హర్మూజ్ జలసంధికి కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తాయని కూడా తెలిపారు. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై ఈ ఫీజులు వసూలు చేసే దిశగా నిర్ణయాలు ఉంటాయని వివరించారు. అయితే ఇరాన్ మిత్ర దేశాలకు ఈ టోల్ ఫీజు ఉంటుందా ? లేదా? అనేది క్లారిటీ రాలేదు. మొత్తానికి యుద్ధం ముగిసిన తర్వాత టోల్ ఫీజు తరహాలోనే నౌకలపై చార్జీలు వసూలు చేసే దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఇది ఇలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు ఈ జల సంధి మూసివేసినట్లు ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అధికారిక ప్రక్రియ చేశారు. మిగిలిన దేశాలన్ని ఈ జలసంధి ద్వారా ప్రయాణించవచ్చని వివరించారు.
ఆంక్షలు విధించిన దేశాలపై గురి
A post shared by Video Memes (@videomemes.vm)
యుద్ధం ముగిసిన తర్వాత టోల్ ఫీజుల ద్వారా నౌకలపై ఛార్జీలు వసూలు చేసేందుకు ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. ఇది ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.


