|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హర్ముజ్ జలసంధి టోల్ ఫీజుల వ్యవహారంపై ఇరాన్ ఎంబసీ సంచలన ప్రకటన!

Published: 23-03-2026, 5:30 PM
హర్ముజ్ జలసంధి టోల్ ఫీజుల వ్యవహారంపై ఇరాన్ ఎంబసీ సంచలన ప్రకటన!
  • హర్ముజ్ జలసంధి టోల్ ఫీజు వసూళ్ల వార్తలను ఇరాన్ ఖండించింది.
  • ఈ అంశంపై తమ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని ఇరాన్ ఎంబసీ తెలిపింది.
  • కొందరు రాజకీయ నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలను పరిగణించవద్దని కోరింది.
  • ఇరాన్ సర్కార్ ఇంకా ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఇరాన్ ఎంబసీ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

హర్ముజ్ జలసంధి టోల్ ఫీజులపై ఇరాన్ ఎంబసీ వివరణ

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. పశ్చిమాసియా యుద్ధానికి స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరామం ఇచ్చారు. ఇరాన్ దేశంతో నిర్ణయాత్మక చర్చలు జరుగుతున్నాయని, రెండు గడిచిన రెండు రోజులుగా జరిగిన ఈ చర్చల కారణంగా ఇరాన్ పైన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశారు ట్రంప్. దీంతో జనాలందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇది ఇలా ఉండగా, హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల ద్వారా 2 మిలియన్ డాలర్లు ఇరాన్ వసూలు చేస్తోందన్న వార్త చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌక‌ల‌ నుంచి 2 మిలియన్ డాలర్ల చొప్పున టోల్ ఫీజు వసూలు చేస్తున్నామ‌న్న‌ది ఏ మాత్రం వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది ఇరాన్ ఎంబసీ. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. టోల్ ఫీజు విషయంలో తమ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

వస్తున్న వార్తల్లో నిజమెంత?

ఇరాన్ లో ఉన్న కొంత మంది రాజకీయ నాయకులు దీనిపై సొంత అభిప్రాయాలను వెలుబుచ్చారు, కానీ దీనిపై ఇరాన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది రాయబార కార్యాలయం. కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలు చెబితే, ఇరాన్ ప్రభుత్వానికి ఏం సంబంధం ? అని ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు మాట్లాడతారు.. వాళ్ల మాటలు పట్టించుకోకూడదని కోరింది. ఇప్పటి వరకు ఇరాన్ సర్కార్ దీనిపై నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది ఎంబసీ.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ

A post shared by First India (@thefirstindia)

హర్ముజ్ జలసంధి టోల్ ఫీజుల విషయంలో ఇరాన్ ఎంబసీ ప్రకటనతో కొంత స్పష్టత వచ్చింది. ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.