
📌 Key Points
- ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.
- ఆరు నెలల పాటు యుద్ధానికి సిద్ధమని ఐఆర్‌జీసీ ప్రకటన చేసింది.
- అమెరికాతో చర్చలకు వెళ్లబోమని ఇరాన్ స్పష్టం చేసింది.
- గల్ఫ్ దేశాల నుంచి భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు.
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆరు నెలల పాటు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అమెరికాతో చర్చలకు వెళ్లబోమని ఇరాన్ తేల్చి చెప్పింది.
ఆరు నెలల పాటు యుద్ధానికి ఇరాన్ సన్నద్ధం
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. యుద్ధం కారణంగా మన ఇండియా పై చాలా ఎఫెక్ట్ పడుతోంది. ఇక ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. ఆరు నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధమని తాజాగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్టేట్ మీడియాకు తెలిపింది. ఇక అమెరికాతో యుద్ధం పై చర్చలకు తాము వెళ్లబోనని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో శనివారం 300 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. ఇది ఇలా ఉండగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు చాలామంది మన పౌరులు తిరిగి వస్తున్నారు. ఈ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలలో పడింది. అందుకే ప్రాణం భయంతో ఇండియాకు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 52,000 మంది ఇండియా నుంచి గల్ఫ్ చేరుకున్నారు.
అమెరికాతో చర్చలకు నిరాకరించిన ఇరాన్
భారత్‌కు తిరిగి వస్తున్న గల్ఫ్ పౌరులు
యుద్ధం యొక్క తీవ్రత పెరుగుతున్న కొద్దీ, గల్ఫ్ దేశాల నుండి భారతీయులు తిరిగి వస్తున్నారు. ఈ పరిస్థితి ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.


