
📌 Key Points
- ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.
- ఖతార్‌లో LNG ఉత్పత్తి నిలిచిపోవడంతో యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడింది.
- యూరియా కొరత ఏర్పడితే రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
- పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఖతర్ లో LNG ఉత్పత్తి నిలిచిపోయింది. దీని ప్రభావం దేశంలోని యూరియా ఉత్పత్తిపై పడింది. దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
యుద్ధంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా మధ్య వార్ భయంకరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎవరు కూడా తగ్గడం లేదు. శాంతి చర్చలకు రావడం లేదు. దాదాపు 5 రోజులుగా దేశాల మధ్య వార్ కొనసాగుతోంది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. ఇక ఈ దాడులకు కౌంటర్ కూడా ఇరాన్ నుంచి వస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ పై నేరుగా దాడులు చేయకుండా, మిడిల్ ఈస్ట్ దేశాలపై టార్గెట్ చేసింది ఇరాన్. దీంతో దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్ లాంటి దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది ఇరాన్. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ ప్రాణ భయంతో వణికిపోతున్నారు.
మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఖతర్ లో LNG ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. యుద్ధం ముగిసే సమయం వరకు ఈ పరిస్థితి నెలకొని ప్రమాదం ఉంది. అయితే దీని ఎఫెక్ట్ ఇండియా పైన పడింది. LNG ఉత్పత్తి నిలిచిపోవడంతో మన ఇండియాలో యూరియా ఉత్పత్తిని కంపెనీలు తగ్గిస్తున్నాయి. వాస్తవంగా ఈ యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్ స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్ గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలో కూడా కీలకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీని కొరత ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ తరుణంలో యూరియా కొరత ఏర్పడితే మాత్రం… రైతులకు చుక్కలు కనిపించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. కొరత ఏర్పడితే కచ్చితంగా యూరియా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ప్రస్తుతానికి అయితే ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
రైతులపై యూరియా కొరత ప్రభావం?
నోట్: LNG అంటే యూరియా ఉత్పత్తిలో ఉపయోగించి ధ్రవీకృత సహజ వాయువు
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
A post shared by Tradeimex Info Solution Pvt Ltd (@tradeimexinfo)
ఖతర్ LNG ఉత్పత్తి నిలిపివేయడంతో దేశంలో యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల యూరియా ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


