
📌 Key Points
- ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోయాయి.
- భారతదేశంలో గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
- ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నా, ప్రజలు మాత్రం ఎలక్ట్రికల్ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు.
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ అనుమతి ఇవ్వడంతో దిగుమతులు పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇరాన్, అమెరికా-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం భారత దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఎల్పీజీ దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.
యుద్ధం ప్రభావంతో ఎల్పీజీ దిగుమతుల్లో అంతరాయం
ఇరాన్, అమెరికా-ఇజ్రాయిల్ మధ్య వార్ ప్రభావం భారత్‌పై పడింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులతో ఆయా దేశాల నుంచి భారత్‌కు రావాల్సిన ఎల్పీజీ దిగుమతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇరాన్‌కు సమీపంలో ఉన్న హోర్ముజ్ జలసంధి ద్వారా భారత్‌కు షిప్పుల ద్వారా ఎల్పీజీ దిగుమతులు రావాల్సి ఉంటుంది. అయితే యుద్ధం కారణంగా హోర్మూజ్ జలసంధి మూత పడింది. దీంతో గల్ఫ్ దేశాలు ఖతార్, సౌదీ ఆరేబియా, యూఏఈల ద్వారా రావాల్సిన 60 శాతం ఎల్‌పీజీ దిగుమతికి ఇబ్బందులు కలిగాయి. దీంతో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సరఫరా, నిల్వ తగ్గిపోయాయి. గ్యాస్ బుకింగులు సైతం నిలిచిపోయాయి. అటు గ్యాస్ గోదాముల్లోనూ స్టాక్ తగ్గిపోయింది. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు మళ్లారు. కరెంట్ కుక్కర్లు, ఎలక్రికల్ స్టైవ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఇండక్షన్ కుక్కర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మరిన్ని రోజుల పాటు ఎల్జీజీ సంక్షోభం ఉన్నా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నమనే సంకేతం భారత్ వైపు కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రజలు
మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎల్పీజీ సిలిండర్ల కొరతపై స్పందించారు. నివాస వినియోగానికి తగినంత గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపింది. గతం మాదిరిగానే బుక్ చేసుకున్న 2-3 రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ అవుతాయిన స్పష్టం చేసింది. అయినా సరే యుద్ధం ఎలాంటి పరిస్థితులను తీసుకొచ్చినా ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధం ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని కూడా వినిపిస్తోంది. ప్రస్తుతమైతే గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు భారతీయులు ఎక్కువగా కరెంట్ కుక్కర్లు, ఎలక్రికల్ స్టైవ్‌లను వినియోగిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
భారత ప్రభుత్వం భరోసా…ప్రజల్లో కొనసాగుతున్న ఆందోళనలు
అయితే హోర్ముజ్ జలసంధిలో భారత్ వచ్చే నౌకలను ఇరాన్ అనుమతించింది. భారత జాతీయ జెండా కనిపిస్తే ఆ నౌకలను వదిలేయాలని ఆ దేశ బలగాలకు సూచించింది. దీంతో భారత్‌కు ఎల్పీజీ దిగుమతులు సాధారణంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సంక్షోభం కూడా త్వరలో ముగియనుంది. కానీ కరెంట్ కుక్కర్లు, ఎలక్రికల్ స్టైవ్‌ల కొనుగోళ్ల ద్వారా గ్యాస్ సంక్షోభాన్ని మా దేశం ఎదుర్కోగలదనే సంకేతాన్ని ఇరాన్‌కు పంపినట్లైందని కొందరు భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
యుద్ధ పరిస్థితులు దేశంపై ఎలాంటి ప్రభావం చూపినా, భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఈ సంఘటన తెలియజేస్తుంది. దిగుమతులు తిరిగి ప్రారంభమైనా ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది.


