
📌 Key Points
- ఐఆర్సీటీసీ ద్వారా హైదరాబాద్ నుండి కర్ణాటకకు 6 రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీలో మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
- సింగిల్ షేరింగ్ ధర రూ.41,630 నుండి ప్రారంభమవుతుంది.
- మార్చి 17, 2026న ఈ టూర్ అందుబాటులో ఉంది, ఇతర తేదీలలో కూడా అవకాశం ఉంది.
వేసవి సెలవులు ప్రారంభం కావడంతో, ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుండి కర్ణాటకకు ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ ధరలో కర్ణాటకలోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ కర్ణాటక టూర్ ప్యాకేజీ వివరాలు
సమ్మర్ స్టార్ట్ అయిపోయింది..! ఇక చాలా మంది టూర్లు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. అయితే మీకోసం ఐఆర్సీటీసీ… బడ్జెట్ ధరలోనే కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అధ్యాత్మిక ప్రాంతాలను చూపించేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది.
“కోస్టల్ కర్ణాటక ‘ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 17 మార్చి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో తెలుసుకోవచ్చు.
టూర్ ప్యాకేజీలో సందర్శించే ప్రదేశాలు
హైదరాబాద్ – కర్ణాటక ట్రిప్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ.41,630ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 23,670 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.19,000గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి.
ధరలు మరియు ఇతర వివరాలు
స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,970గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 38600గా ఉండగా…. డబుల్ షేరింగ్ కు రూ. 20650, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15970 గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తక్కువ ధరలో కర్ణాటకలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. ఆసక్తి గలవారు వెంటనే బుక్ చేసుకోవచ్చు.


