|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ గదిలో ఆమె ఉన్నట్టా.. లేనట్టా..? ఓటీటీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూశారా?

Published: 02-11-2025, 9:28 PM
ఆ గదిలో ఆమె ఉన్నట్టా.. లేనట్టా..? ఓటీటీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూశారా?

థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10’ ఒక అద్భుతమైన ఎంపిక. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులో ఉన్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్, చూసే ప్రేక్షకుడిని చివరి వరకు ఉత్కంఠకు గురి చేస్తుంది. ఒక షిప్ ప్రయాణంలో జరిగిన విచిత్ర సంఘటనల చుట్టూ ఈ కథ సాగుతుంది.

Key Points

1

'ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్.

2

ప్రముఖ నవలా రచయిత్రి రూత్ వేర్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

4

జర్నలిస్ట్ లారా, గదిలో ఉన్న అమ్మాయి అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తుంది.

‘ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10’ కథాంశం

థ్రిల్లర్ జోనర్లందు సైకలాజికల్ థ్రిల్లింగే వేరయా…నిజానికి సినిమాల్లో ఉన్న అన్ని జోనర్లలో థ్రిల్లర్ జోనర్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోను సైకలాజికల్ థ్రిల్లర్ మరింత ప్రత్యేకమైనది, ఎందుకంటే చూసే ప్రేక్షకుడిని ఆద్యంతం కట్టిపడేసేది ఈ సైకలాజికల్ థ్రిల్లరే. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా ఇటీవలే విడుదలైన సినిమా ది ఉమెన్ ఇన్ కేబిన్ 10(The Woman In Cabin 10 OTT Movie Review) ఈ కోవకు చెందినదే. ప్రముఖ నవలా రచయిత్రి రూత్ వేర్ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమాను దర్శకులు సైమన్ స్టోన్ తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతోంది.

ఈ సినిమా చాలా వరకు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే…ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన లారా కు ధనవంతురాలైన అనీబల్మర్ నుండి ఓ ఆహ్వానం అందుతుంది. క్యాన్సర్ బాధితురాలిగా ఆఖరి దశలో ఉన్న అనీబల్మర్ తన యావదాస్తిని తన భర్త అయిన రిచర్డ్ పేరిట రాయడానికి, అలాగే తాను నిర్వహించే స్వచ్ఛంధ సంస్థకు ఫండ్ రైజింగ్ కోసం ప్రపంచంలో ఉన్న ధనవంతులతో పాటు లారాని కూడా ఓ షిప్ ప్రయాణానికి ఆహ్వానిస్తుంది.

సస్పెన్స్, థ్రిల్లింగ్ క్షణాలు

వీరంతా కలిసి ఓ విలాసవంతమైన షిప్ లో నార్వేకి వెళుతుంటారు. లారాకి ఆ షిప్ లో 8వ నెంబరు గదిని కేటాయిస్తారు. రెండు రోజుల ఈ ప్రయాణంలో ప్రతి క్షణం విందులు, వినోదాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అనూహ్యంగా ఓ రోజు రాత్రి 10 వ నెంబరు గది నుండి ఓ అమ్మాయి సముద్రంలోకి పడిపోవడం లారా గమనిస్తుంది. ఇదే విషయం నిర్వాహకులకు చెబితే ఆ గదిని ఎప్పుడూ తెరవలేదని, దాంట్లో ఎవరూ లేరని లారాకు చెబుతారు.

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్

లారా వాళ్ళ మాటలు నమ్మదు, ఇంతలో లారా పై కూడా ఓ హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ 10వ నెంబరులో ఉన్న అమ్మాయి ఎవరో, ఎందుకు పడిపోయిందో తెలుసుకోవడానికి లారా శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ గదిలో ఆమె ఉన్నట్టా లేనట్టా, అలాగే లారా పై హత్యాయత్నం చేసిందెవరు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానలు కావాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ది ఉమెన్ ఇన్ కేబిన్ 10 సినిమాని చూడాల్సిందే. అక్కడక్కడా కాస్త స్లో గా అనిపించినా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ఫైండ్ అవుట్ ది ఉమెన్ ఇన్ కేబిన్ 10 దిస్ వీక్. – హరికృష్ణ ఇంటూరు

మొత్తం మీద, ‘ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10’ వీకెండ్ కోసం తప్పక చూడాల్సిన సైకలాజికల్ థ్రిల్లర్. నెమ్మదిగా సాగినా, సస్పెన్స్, మిస్టరీ ప్రేమించే వారికి ఈ సినిమా మంచి అనుభూతిని అందిస్తుంది. వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.