|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జబర్దస్త్ లో షాకింగ్ మోసం! కిరాక్ ఆర్పీ చేతిలో దగాపడ్డ కమెడియన్ ఎవరో తెలుసా?

Published: 03-04-2026, 4:35 AM
జబర్దస్త్ లో షాకింగ్ మోసం! కిరాక్ ఆర్పీ చేతిలో దగాపడ్డ కమెడియన్ ఎవరో తెలుసా?
  • కిరాక్ ఆర్పీ చేసిన మోసంతో జబర్దస్త్ కమెడియన్ తన్మయి తీవ్ర ఆవేదన!
  • ఆర్పీ నమ్మించి మోసం చేశాడని తన్మయి సంచలన ఆరోపణలు
  • జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక ఆర్పీ తనను పట్టించుకోలేదని తన్మయి వాఖ్యలు
  • నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారంతో ఆర్పీ బిజీగా ఉన్నాడని సమాచారం

జబర్దస్త్ కామెడీ షోలో ఒక సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. కిరాక్ ఆర్పీ ఒక కమెడియన్‌ను మోసం చేశాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ కమెడియన్ ఎవరు? ఏం జరిగిందో తెలుసుకుందాం రండి!

కిరాక్ ఆర్పీ మోసంపై తన్మయి సంచలన ఆరోపణలు!

ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న కమెడియన్స్ ను కూడా బయటకు తీసి.. లైఫ్ ఇచ్చిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో వల్ల టాలీవుడ్ కు ఎంతో మంది మంచి కమెడియన్స్ లభించారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రచ్చ రవి, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, రాఘవ, వేణు, ధనరాజ్ ఇలా చాలామంది కమెడియన్లు జబర్దస్త్ వల్ల పాపులర్ అయ్యారు. అందులో కిరాక్ ఆర్పీ లాంటి కమెడియన్లు వివాదాస్పద కూడా అయ్యారు.

ఎంతో మంది కమెడియన్స్ కు మంచి కెరీర్ ను ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షో. ఈ కార్యక్రమం వల్ల ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో.. అంతకు మించి కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేసింది. జబర్దస్త్ షో తో పాటు.. ఈ స్టేజ్ నుంచి వచ్చిన కమెడియన్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక పట్టించుకోని ఆర్పీ

మరీ ముఖ్యంగా కిరాక్ ఆర్పీ చేసే వీడియోలు, ఆయన మాట్లాడే వీడియోలు కూడా వివాదం అవుతుంటాయి. పొలిటికల్ గా కిరాక్ ఆర్పీ కామెంట్లు సంచలనంగా మారడంతో పాటు.. వివాదానికి కూడా దారి తీశాయి. తాజాగా కీరాక్ ఆర్పీ వల్ల నేను మోసపోయాను అని జబర్దస్త్ కమెడియన్ ఒకరు ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎవరు ఆమె.

జబర్దస్త్ అంటేనే లేడీ గెటప్ లకు చాలా ఫేమస్. ఈ కామెడీ షోలో లేడీ గెటప్ లు చేస్తూ.. ట్రాన్స్ జెండర్స్ గా మారిన వారు చాలామంది ఉన్నారు. వారిలో తన్మయి కూడా ఒకరు. ఆమె రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జబర్దస్త్ వాళ్లు తనకు చేసిందేమి లేదని కామెంట్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డాను. జబర్దస్త్ లో చేసినందుకు జీతం మాత్రమే తీసుకున్నాను..

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో బిజీగా ఆర్పీ!

కష్టం ఉన్నప్పుడు మాత్రం జబర్దస్త్ నుంచి ఎవరు నన్ను ఆదుకోలేదు. చివరికి మా నాన్నచనిపోతే కూడా ఎవరు నా వెంట లేరు.. నూకరాజు మాత్రమే నేను ఫోన్ చేయగానే వచ్చి నన్న తీసుకుని వెళ్లాడు. ఇక కిరాక్ ఆర్పీని నమ్మి నేను జబర్దస్త్ నుంచి బయటకు వస్తే.. నన్ను అస్సలు పట్టించుకోలేదు. అప్పటి నుంచి నాకు కనిపించడమే మానేశాడు. ఒక రకంగా కిరాక్ ఆర్పీ వల్ల నేను మోసపోయాను” అని తన్మయి వెల్లడించింది.

జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆర్పీ.. ఆతరువాత కొన్ని వివాదాల వల్ల ఆ షో నుంచి బయటకు వచ్చాడు.. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని దర్శకుడిగా ప్రయత్నం చేశాడు. కానీ అవి సక్సెస్ అవ్వలేదు. దాంతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో వ్యాపారం మొదలు పెట్టాడు. అది సక్సెస్ అవ్వడంతో.. పలు బ్రాంచిలు కూడా స్టార్ట్ చేశాడు. ఆతరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆర్పీ.. తెలుగుదేశం లో ఉంటూ.. వైసీపీని, ముఖ్యంగా రోజాని టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం సంచలనం గా మారింది. ప్రస్తుతం తన వ్యాపారం కూడా ఆపేసి.. పొలిటికల్ గా యాక్టీవ్ అయ్యాడు ఆర్పీ.

జబర్దస్త్ కమెడియన్ల మధ్య జరుగుతున్న ఈ వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.