|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కోడి పందెంలో జబర్దస్త్ నరేష్: గంటలో లక్షలు గెలిచారా? అసలు నిజం ఇది!

Published: 16-01-2026, 8:15 AM
కోడి పందెంలో జబర్దస్త్ నరేష్: గంటలో లక్షలు గెలిచారా? అసలు నిజం ఇది!
  • జబర్దస్త్ నరేష్ సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు, కోడి పందాలపై వివరణ ఇచ్చారు.
  • బుల్లెట్ భాస్కర్, హైమా కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు, సందడి చేశారు.
  • గోదావరి జిల్లాల ఆతిథ్యం అమోఘమని బుల్లెట్ భాస్కర్ కొనియాడారు.
  • కోడి పందెంల్లో గెలుపు ఓటముల గురించి మాట్లాడకూడదని భాస్కర్ సరదాగా అన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేరులో జబర్దస్త్ టీమ్ సందడి చేసింది. బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ నరేష్, హైమా పాల్గొన్నారు. కోడి పందాలపై నరేష్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

తాడేరులో జబర్దస్త్ టీమ్ సందడి

Jabardasth Naresh: సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాలు గుర్తుకు వస్తాయి. పండగ వాతావరణం, ఆతిథ్యం, ఆటలు, కోడి పందాలు… ఇవన్నీ కలిసి గోదావరి సంక్రాంతికి ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి. ఇదే వాతావరణాన్ని తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని తాడేరు గ్రామంలో చూసే అవకాశం వచ్చింది. అక్కడ జబర్దస్త్ టీమ్ సందడి చేసింది.

ఈ కార్యక్రమంలో బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ నరేష్.. హైమా పాల్గొన్నారు. కోడి పందాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన బుల్లెట్ భాస్కర్ మీడియాతో సరదాగా మాట్లాడారు. “గోదావరి జిల్లాలకు రావడం అదృష్టం. ఇక్కడి ఆతిథ్యం అమోఘం. పండగ అంటే ఇక్కడే జరగాలి” అని ఆయన అన్నారు. పందాల గురించి అడిగితే, “పందాల్లో ఎంత పెట్టామో, ఎంత గెలిచామో చెప్పకూడదు. వచ్చినా చెప్పకూడదు, పోయినా చెప్పకూడదు” అంటూ నవ్వులు పూయించారు.

కోడి పందాలపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్

హైమా మాట్లాడుతూ, “ఇది నాకు కోడి పందాలు చూడడం రెండోసారి. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వంటలు పెట్టి పెట్టి మమ్మల్ని ముంచేస్తున్నారు” అని చెప్పింది. తాను ఎలాంటి పందాలు వేయలేదని, కేవలం సరదాగా చూడడానికి మాత్రమే వచ్చానని స్పష్టం చేసింది.

ఇక జబర్దస్త్ నరేష్ గురించి గంటలో 10 లక్షలు, రెండు రోజుల్లో 20 లక్షలు గెలిచారనే బుల్లెట్ భాస్కర్ గారు చెబుతున్నారు ఇదంతా నిజమేనా అని అడగగా.. దీనిపై స్పందించిన నరేష్, “అవన్నీ జోక్స్ మాత్రమే. నేను టైం పాస్ కోసం చూస్తాను తప్ప పందాలు వేయను. భాస్కర్ అన్న మాటలను సీరియస్‌గా తీసుకోకండి” అంటూ నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు. భీమవరం ప్రజలకు, గోదావరి జిల్లాల వారందరికీ హ్యాపీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

పందెం లాభాలపై నరేష్ వివరణ

మొత్తం పైన.. తాడేరు గ్రామంలో జబర్దస్త్ టీమ్ సందడి పండగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అభిమానులతో సెల్ఫీలు, సరదా మాటలు, నవ్వులతో ఆ రోజు అక్కడికి వచ్చిన వారందరికీ ఇది ఒక గుర్తుండిపోయే సంక్రాంతిగా మారింది.

మొత్తానికి జబర్దస్త్ టీమ్ తాడేరులో సందడి చేయడంతో సంక్రాంతి వేడుకలకు మరింత కళ వచ్చింది. నవ్వులు, సెల్ఫీలతో అభిమానులకు ఈ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.