|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జై హనుమాన్ మహా యజ్ఞం: అంజనాద్రిలో అట్టహాసంగా ప్రారంభం.. రిషబ్ శెట్టి అదుర్స్!

Published: 22-02-2026, 4:35 AM
జై హనుమాన్ మహా యజ్ఞం: అంజనాద్రిలో అట్టహాసంగా ప్రారంభం.. రిషబ్ శెట్టి అదుర్స్!
  • ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ సినిమా ప్రారంభం
  • హంపిలోని అంజనాద్రి బెట్ట వద్ద ప్రత్యేక పూజలు
  • హనుమంతుడి పాత్రలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి
  • ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ సినిమా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు.

అంజనాద్రిలో ‘జై హనుమాన్’ ప్రారంభం

Jai Hanuman:బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma), ఇప్పుడు దాని సీక్వెల్ ‘జై హనుమాన్’ (Jai Hanuman) పనులను అధికారికంగా మొదలుపెట్టారు. హనుమంతుడి జన్మస్థలమైన హంపిలోని అంజనాద్రి బెట్ట సాక్షిగా నేడు (ఫిబ్రవరి 22) ఈ చిత్రానికి అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నటిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. ఈరోజు జరిగిన లాంచ్ ఈవెంట్‌లో రిషబ్ తన భార్యతో కలిసి ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. ఇక మొదటి భాగంలో హీరోగా నటించిన తేజ సజ్జా ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తే, ఈ సీక్వెల్‌లో సాక్షాత్తూ హనుమంతుడే కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ప్రశాంత్ వర్మ ఈ కథను సిద్ధం చేశారు. రిషబ్ శెట్టి లాంటి పవర్‌ఫుల్ నటుడు ఈ పాత్రకు ప్రాణం పోస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్టులో దగ్గుబాటి రానా(Daggubati rana) కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్ కోసం అంజనాద్రి 2.0 పేరుతో ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇక మొదటి భాగం కంటే గ్రాఫిక్స్, విజువల్స్ పదింతలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. ఈ భారీ పౌరాణిక యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది.

హనుమంతుడిగా రిషబ్ శెట్టి

కేవలం 40 కోట్లతో తీసిన హనుమాన్ సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ విజయంతో వచ్చిన బాధ్యతను మోస్తూ, అంతకు మించిన విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించడమే తన లక్ష్యమని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇక ఆధ్యాత్మికతకు మోడ్రన్ టెక్నాలజీని జోడించి, భారతీయ సూపర్ హీరో సినిమాను గ్లోబల్ రేంజ్‌లో నిలబెట్టాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అంజనాద్రి కొండపై నేడు జరిగిన ఈ పూజతో ఒక సరికొత్త సినిమాటిక్ ప్రయాణం మొదలైంది.

ఇదిలా ఉండదా మరొకవైపు ప్రభాస్ తో బ్రహ్మ రాక్షస సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అధికారిక అప్డేట్ బయటకు రాలేదు. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ వరుస లైనప్స్ కారణంగా ఈ చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోతున్నారని, అందుకే ఈ సినిమాను ఆపి వేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ప్రశాంత్ కి షాక్ ఇచ్చినా.. జై హనుమాన్ తో భారీ ఊరట కలిగిందని చెప్పవచ్చు.

భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం

Actor Rishab Shetty at the venue of #JaiHanuman Pooja ceremony #PrasanthVarma #RishabShetty pic.twitter.com/6DWd5xzF8X

— BIG TV Cinema (@BigtvCinema) February 22, 2026

మొత్తానికి ‘హనుమాన్’ సినిమా విజయం తర్వాత ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.