|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జననాయగన్ రీమేక్ కాదు అన్న డైరెక్టర్.. ట్రైలర్ తర్వాత నెటిజన్ల ఫన్నీ పంచులు!

Published: 07-01-2026, 3:35 AM
జననాయగన్ రీమేక్ కాదు అన్న డైరెక్టర్.. ట్రైలర్ తర్వాత నెటిజన్ల ఫన్నీ పంచులు!
  • విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగుపెడుతూ తన ఆఖరి సినిమాగా ‘జననాయగన్’ చేస్తున్నారు.
  • హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ రీమేక్ కాదని మొదట చెప్పారు.
  • అయితే, ట్రైలర్ విడుదలయ్యాక ఇది 90% భగవంత్ కేసరి రీమేక్ అని స్పష్టమైంది.
  • విజయ్ చెంపపై పుట్టుమచ్చ లేదంటూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

విజయ్ దళపతి చివరి సినిమాగా తెరకెక్కుతున్న “జననాయగన్” చిత్రం భగవంత్ కేసరి రీమేక్ కాదంటూ దర్శకుడు హెచ్ వినోద్ ముందు ప్రకటించారు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక రీమేక్ అని స్పష్టమవడంతో నెటిజన్లు ఫన్నీ మీమ్స్, కామెంట్ల ద్వారా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అసలు కథనంలోకి వెళ్దాం.

జననాయగన్: రీమేక్ కాదు అన్న డైరెక్టర్ మాట

Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు రాజకీయాల్లోకి అడుగులు వేసిన విషయం తెలిసిందే. టీవీకే అనే ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ దళపతి ఈ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే సినిమాల ద్వారా తనను ఆదరించిన ప్రజలకు మంచి చేకూర్చాలనే నేపథ్యంలో స్థాపించిన ఈ పార్టీ ద్వారా వచ్చే ఎన్నికలలో పోటీ చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఇటు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రముఖ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో జననాయగన్ అనే సినిమా చేస్తున్నారు. పైగా విజయ్ దళపతి ఆఖరి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.

విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఈ సినిమాపై అందరి అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇది టాలీవుడ్ బడా సీనియర్ హీరో బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ మలేషియాలో నిర్వహించినప్పుడు.. ఈ చిత్ర దర్శకుడు హెచ్ వినోద్ ఇది 100% భగవంత్ కేసరి రీమేక్ కాదు .. విజయ్ కోసం ప్రత్యేకంగా రాసుకున్న కథ అంటూ తెలిపారు. దీంతో నిజంగానే ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ కాదు అని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ తర్వాత ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా 90% భగవంత్ కేసరికి రీమేక్ అని స్పష్టం అయ్యింది. దీంతో డైరెక్టర్ అబద్ధం చెప్పాడని ఇది అటు ఇటుగా మార్చి భగవంత్ కేసరి సినిమాను పూర్తిగా దింపబోతున్నాడని కామెంట్లు కూడా వినిపించాయి. పైగా ఈ చిత్రం నిర్మాతలు భగవంత్ కేసరి రీమేక్ హక్కులను 4.5 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేశారు. ఇక దీంతో రీమేక్ అంటూ వార్తలు రాగా ఇప్పుడు మరో ఫన్నీ పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇక ఆ పోస్టులో విజయ్ దళపతి ఎడమ చెంప పైన పుట్టుమచ్చ ఉంది. కానీ బాలకృష్ణ చెంప పైన ఆ పుట్టుమచ్చ లేదు. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఇది కచ్చితంగా భగవంతుకేసరి రీమేక్ కాదు అంటూ ఫన్నీ పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొత్తానికైతే రీమేక్ గా రాబోతున్న జననాయగన్ చిత్రం రీమేక్ కాదని డైరెక్టర్ చెప్పడంతో ఇలా ఫన్నీగా మీమ్స్ , ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు నెటిజన్స్. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

ట్రైలర్ విడుదల: రీమేక్ అంటూ స్పష్టత

విజయ దళపతి హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన విడుదల కాబోతోంది. తెలుగులో జననాయకుడు అంటూ డబ్బింగ్ వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హిందీలో జననేత అనే పేరిట రిలీజ్ చేయబోతున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఫన్నీ మీమ్స్

Its briyani pic.twitter.com/TIoFNvDVBc

— என் உயிர் உள்ளவரை Superstar ரஜினி ரசிகன் (@A_CROW_KILLER) January 6, 2026

రీమేక్ కాదన్న మాట తప్పని తేలడంతో “జననాయగన్” సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. మరి చిత్రబృందం దీనిపై ఎలా స్పందిస్తుందో, లేదా మరిన్ని ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ కొనసాగిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.