|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jarann OTT Telugu: చేతుబడుల సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో

Updated: 12-11-2025, 12:12 AM
Jarann OTT Telugu: చేతుబడుల సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో

ఓటీటీలో హారర్ సినిమాలు ఇష్టపడే వారికి శుభవార్త. ఈ ఏడాది జూన్‌లో రిలీజైన మరాఠీ సైకలాజికల్ హారర్ చిత్రం ‘జారన్’ ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి జీ5లో అందుబాటులోకి వచ్చింది. చేతబడుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆడియన్స్‌ను ఉత్కంఠకు గురిచేస్తుంది.

Key Points

1

జారన్: మరాఠీ సైకలాజికల్ హారర్ చిత్రం, 'చేతబడి' అని అర్థం.

2

జూన్‌లో మరాఠీలో విడుదలై, ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో జీ5లో అందుబాటులో ఉంది.

4

రాధ కుటుంబంపై చిన్నప్పటి నుంచి ఉన్న చేతబడి ప్రభావం చుట్టూ కథ నడుస్తుంది.

జారన్: మరాఠీ నుంచి తెలుగులోకి

ఓటీటీలో థ్రిల్లర్ లేదంటే హారర్ సినిమాలని ఎక్కువగా చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు డిఫరెంట్ హారర్ మూవీస్ వస్తూనే ఉంటాయి. తెలుగులో మాత్రం వివిధ భాషల్లోనూ ఈ జానర్ మూవీస్ హిట్ ఫార్ములానే. అలా ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ఓ మరాఠీ హారర్.. ఇ‍న్నాళ్లకు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటి మూవీ స్పెషాలిటీ? ఎందులో చూడొచ్చు.

జారన్ సినిమా కథాంశం

ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో రిలీజైన మరాఠీ సినిమా ‘జారన్’. మరాఠీ భాషలో ఈ టైటిల్‍‌కి అర్థం చేతబడి. పేరుకి తగ్గట్లే మొత్తం బ్లాక్ మ్యాజిక్ తరహా సీన్స్ ఉంటాయి. ఇది ఆగస్టులోనే జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే హిందీలో మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌ని కూడా తీసుకొచ్చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సైకలాజికల్ హారర్ చిత్రాలంటే ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయండి.

‘జారన్’ విషయానికొస్తే.. రాధ(అమృత సుభాష్)కు భర్త, కుమార్తె ఉంటారు. బతకడం అయితే బతుకుతూ ఉంటుంది గానీ ఈమె ఇంట్లో ఏ మాత్రం ప్రశాంతత, సంతోషం అనేది ఉండదు. దానికి కారణం చేతబడి. రాధ కుటుంబాన్ని ఎవరో చేతబడి చేస్తారు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి రాధ.. ఈ సమస్యతో బాధపడుతూ ఉంటుంది. అసలు రాధకు ఎవరు ఇలా చేతబడి చేశారు? ఆమె కుటుంబంపై ఎవరికి పగ ఉంది? ఎందుకు ఉంది? చివరకు ఏమైందనేదే అసలు స్టోరీ.

ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

చేతబడుల నేపథ్యంతో కూడిన ‘జారన్’ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హారర్ అనుభూతిని పంచుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ జానర్ ఇష్టపడేవారు జీ5లో తెలుగులో ఈ చిత్రాన్ని చూడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.