
📌 Key Points
- ఘట్టమనేని కృష్ణ మనవడిగా జయకృష్ణ సినీ రంగ ప్రవేశం.
- శ్రీనివాస మంగాపురం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు జయకృష్ణ.
- తొలి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మహేష్ బాబు.
- దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ సినిమా.
సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి వస్తూ తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఘట్టమనేని కుటుంబం నుండి జయకృష్ణ అనే కొత్త వారసుడు వస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేనల్లుడి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
జయకృష్ణ సినీ రంగ ప్రవేశం
Srinivasa Mangapuram: ఈమధ్య కాలంలో సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ నటనతో , టాలెంట్ తో అభిమానులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అటు సెలబ్రిటీలు కూడా తమ వారసుల ఎంట్రీకి దగ్గరుండి మరీ సర్వం సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఘట్టమనేని కుటుంబం నుండి ఈ కొత్త ఏడాది ఒక కొత్త వారసుడు లాంచ్ కాబోతున్నారు. ఈ మేరకు ఆ వారసుడి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఆయన ఎవరో కాదు ఘట్టమనేని కృష్ణ వారసుడు ఘట్టమనేని జయకృష్ణ.
దివంగత నటుడు రమేష్ బాబు కొడుకుగా , దివంగత నటుడు కృష్ణ మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు జయకృష్ణ. ఈ మేరకు జయకృష్ణ సినీ ఎంట్రీ బాధ్యతలను సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకోవడమే కాకుండా జయకృష్ణ తొలి సినిమా ఫస్ట్ పోస్టర్ ను తన చేతుల మీదుగా రిలీజ్ చేశారు.. ప్రస్తుతం జయకృష్ణ శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
మహేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జయకృష్ణకి సంబంధించి.. తన మొదటి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో.. బుల్లెట్ బండి నడుపుతూ.. గన్ను పట్టుకొని యాక్షన్ లుక్కులో కనిపించారు జయకృష్ణ. ఇతని మాస్ లుక్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తొలి సినిమాతో ఈ ఏడాది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జయకృష్ణకు అభిమానులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి ఈ సినిమా జయ కృష్ణకు ఏ విధంగా మంచి పేరు తీసుకొస్తుందో చూడాలి.
ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. మరొకవైపు తన అన్నయ్య కొడుకును ఇండస్ట్రీలోకి లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే జయకృష్ణ తన మొదటి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అలాగే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు.యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి.
Here’s the First Look of our #JayaKrishnaGhattamaneni , all set to strike your hearts ❤️🔥
శ్రీనివాస మంగాపురం చిత్ర విశేషాలు
Await a tornado of love, emotions & much more from #SrinivasaMangapuram ✊🏻❤️ #RashaThadani #GVPrakashKumar #VyjayanthiMovies #AshwiniDutt #Tollywood #entertainment #Bigtv #Bigtvcinema pic.twitter.com/gkHfw9zHDv
— BIG TV Cinema (@BigtvCinema) January 10, 2026
మొత్తానికి జయకృష్ణ తన తొలి సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. మహేష్ బాబు తన మేనల్లుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


