
📌 Key Points
- శ్రీలీల కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది.
- భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలతో శ్రీలీల తిరిగి ఫామ్ లోకి వచ్చింది.
- మాస్ జాతర, పరాశక్తి సినిమాలు శ్రీలీలకు ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.
- ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై శ్రీలీల గంపెడాశలు పెట్టుకుంది.
టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఆటుపోట్లతో సాగుతోంది. అయితే ఇప్పుడు ఆమె ఆశలన్నీ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపైనే ఉన్నాయి.
శ్రీలీల సినీ కెరీర్ ఆరంభం, విజయాలు
SreeLeela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది శ్రీ లీల(SreeLeela ). ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరుస విజయాలు అందుకుంటూ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత నటించిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో చాలామంది ఇక ఈమె ఫేడౌట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna ) హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలయ్యకు కూతురు పాత్రలో నటించి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్గా నటించడమే కాకుండా “కుర్చీ మడతపెట్టి” అని స్పెషల్ సాంగ్ చేసి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మరోసారి పాపులారిటీ దక్కించుకుంది.
ఇక తర్వాత ‘ పుష్ప2’ సినిమాలో “కిస్సిక్ ” సాంగ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్గా ఈ మధ్యకాలంలో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి. గత ఏడాది మాస్ మహారాజ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ సినిమాలో హీరోయిన్గా నటించింది కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక అలాగే ఈ ఏడాది కోలీవుడ్లో తన అరంగేట్రం అయిపోయింది. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఈమెకు విజయాన్ని అందించలేదు. ముఖ్యంగా ఒక వర్గం వారు ఈ సినిమా బాగుందని చెప్పినా.. అక్కడ ఈ సినిమాపై విమర్శలు వస్తూ ఉండడం గమనార్హం.
వెనుకబడిన విజయాలు, ఎదురుచూపులు
ఇకపోతే ప్రస్తుతం ఈమె హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ కూడా ఈ సినిమా పైనే ఉన్నాయని చెప్పాలి. కనీసం ఈ సినిమా అయినా ఈమెకు సక్సెస్ అందిస్తుందా ..? డీసీఎం పవన్ కళ్యాణ్ ఈమెను కాపాడతారా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ లీలా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఈ సినిమా ఈమెకు ఏ విధంగా సక్సెస్ అందిస్తుంది కనీసం ఈమె సక్సెస్ కు పవన్ కళ్యాణ్ కారణమవుతారా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమా విడుదలయితే కానీ దీని ఫలితాన్ని బట్టి ఈమె కెరియర్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో తెలియాల్సి ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆశలు
ఇదిలా ఉండగా మరొకవైపు గతంలో శృతిహాసన్ కూడా ఇలాంటి పరిస్థితులని ఎదుర్కొంది అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2010లో శృతిహాసన్ టాప్ హీరోయిన్గా కొనసాగింది . కానీ వరుస డిజాస్టర్లతో తన కెరీర్ను డౌన్ చేసుకుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకొని.. ఓవర్ నైట్ లోనే టాప్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్లో భారీ ఛాన్సులు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా మారిపోయింది. అప్పుడు శృతిహాసన్ ను హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి ఎలాగైతే ఆదుకున్నారో ఇప్పుడు శ్రీలీలని కూడా ఈ కాంబో ఆదుకోవాలని ,ఈమెకు మంచి సక్సెస్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల ఆశలన్నీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.


