
సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ, వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
Key Points
మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ.
RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా నిర్మాణం.
వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ సినిమా.
మహేష్ బాబు ఈ ప్రాజెక్టును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
జయకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభం
Mahesh Babu – Jayakrishna : సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మూడేళ్ళ క్రితం మహేష్ అన్న రమేష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచే రమేష్ తనయుడు జయకృష్ణని మహేష్ హీరో చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ.
వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై RX 100, మంగళవరం లాంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా కథ, ప్రాజెక్టు ని మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షించారని టాలీవుడ్ టాక్. అలా బాబాయ్ అండతో అబ్బాయి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
అజయ్ భూపతి దర్శకత్వం
మహేష్ బాబు మద్దతు
జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటన శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. మరి జయకృష్ణకు ఘట్టమనేని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెల్కమ్ చెప్తారో చూడాలి.
జయకృష్ణకు ఘట్టమనేని ఫ్యాన్స్ ఎలాంటి స్వాగతం పలుకుతారో చూడాలి. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం.


