|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్, SJ సూర్యతో మళ్ళీ సినిమా? జయం రవి సంచలన రిక్వెస్ట్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 22-01-2026, 1:05 AM
పవన్, SJ సూర్యతో మళ్ళీ సినిమా? జయం రవి సంచలన రిక్వెస్ట్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • పవన్, ఎస్.జె.సూర్య కాంబోలో వచ్చిన ఖుషి సినిమా ఒక కల్ట్ క్లాసిక్!
  • ఖుషి సీక్వెల్ కోసం ఎస్.జె.సూర్యను కోరిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!
  • టైగర్ అఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు ఎస్.జె.సూర్య శుభాకాంక్షలు!
  • పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య కాంబో కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపిన జయం రవి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుందా అనే ఆసక్తి నెలకొంది. ఆ వివరాల్లోకి వెళ్దాం!

ఖుషి కాంబో మళ్ళీ వస్తుందా?

Pawan Kalyan: ఖుషి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్ జె సూర్య కాంబోలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ప్రెజెంట్ జనరేషన్ మాటల్లో చెప్పాలంటే ఇది కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. స్టోరీ, ఎమోషన్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్(Pawan Kalyan), భూమిక క్యూట్ నెస్, ఎస్ జె సూర్య టేకింగ్, మణిశర్మ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ వెరసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేశాయి.

ఇక ఈ సినిమా తరువాత మళ్ళీ అలాంటి సినిమా రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేస్తాను అంటూ ఎస్ జె సూర్య సూర్య కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఆ సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా సార్లు దర్శకుడు ఎస్ జె సూర్యను రిక్వెస్ట్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ లిస్టులో తమిళ స్టార్ జయం రవి. మీ ఇద్దరు(పవన్ కళ్యాణ్- ఎస్ జె సూర్య) కలిసి మళ్ళీ సినిమా చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు.

జయం రవి రిక్వెస్ట్ వెనుక అసలు కథేంటి?

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇటీవల పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నుంచి టైగర్ అఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును స్వీకరించిన విషయం తెలిసిందే. అందుకు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు డైరెక్టర్ ఎస్ జె సూర్య. ఆ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన హీరో జయం రవి.. ‘మీ కాంబోలో మరో సినిమా రావాలని మేమంతా ఎదురుచూస్తున్నాము’ అంటూ రాసుకొచ్చాడు.

వైరల్ అవుతున్న జయం రవి కామెంట్స్!

దీంతో, జయం రవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒక స్టార్ హీరో అయుండి మరో హీరో సినిమా కోసం ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ తో మరో ఖుషి లాంటి సినిమా ప్లాన్ చేయాలంటూ ఎస్ జె సూర్య ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

జయం రవి చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య కాంబినేషన్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.