
కోలీవుడ్ నటుడు జయం రవి తన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ జంట తిరుమలలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జయం రవి ప్రస్తుతం కొత్త సినిమాలలో బిజీగా ఉన్నారు.
Key Points
జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వెళ్లారు.
రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవం ముందు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల యాత్ర
కోలీవుడ్ హీరో జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . తన గర్ల్ ఫ్రెండ్ గా భావిస్తోన్న సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వచ్చారు . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా పలుసార్లు కనిపించారు . తాజాగా తిరుమలలో సందడి చేశారు .
సోషల్ మీడియాలో వైరల్
జయం రవి సొంత నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందు తిరుమల ఆలయాన్ని సందర్శించారు . సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వీరిద్దరు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు . కాగా .. జయం రవి తొలి నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్‌ను చెన్నైలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి .
కెన్నీషాతో కలిసి
మరోవైపు జయం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు . ప్రస్తుతం గణేష్ కె బాబు దర్శకత్వం వహించిన ‘కరాటే బాబు’ , సుధా కొంగర దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు . అయితే గత కొన్ని నెలలుగా తన భార్య ఆర్తితో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచారు. వీరిద్దరు విడిపోవడానికి సింగర్ కెనీషా ప్రమేయం ఉందని వార్తలొచ్చాయి. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో చేతులు పట్టుకుని కనిపించడంతో రూమర్స్ మరింత ఊహందుకున్నాయి.
జయం రవి తన కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభానికి ముందు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కెన్నీషాతో కలిసి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన త్వరలోనే కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


