|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jetlee : కమెడియన్ సత్య పక్కన హీరోయిన్ గా మిస్ యూనివర్స్ ఇండియా

Published: 09-12-2025, 8:48 AM
Jetlee : కమెడియన్ సత్య పక్కన హీరోయిన్ గా మిస్ యూనివర్స్ ఇండియా
  • “జెట్లీ” సినిమాలో కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్నారు.
  • మిస్ యూనివర్స్ ఇండియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా పరిచయం కానుంది.
  • దర్శకుడు రితీష్ రానా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
  • రేపు హీరోయిన్ రియా పాత్రను అధికారికంగా పరిచయం చేయనున్నారు.

కమెడియన్ సత్య హీరోగా రితీష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “జెట్లీ”. ఈ సినిమాలో మిస్ యూనివర్స్ ఇండియా హీరోయిన్‌గా పరిచయం కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపు ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రియా పాత్రను అధికారికంగా పరిచయం చేయనున్నారు. ఇది ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

కమెడియన్ సత్య హీరోగా “జెట్లీ”

Jetlee : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటులలో సత్య ఒకరు. ముఖ్యంగా సత్య చేసే కొన్ని కామెడీ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సత్యా ను పూర్తిస్థాయిలో వాడుకున్న ఏకైక డైరెక్టర్ రితీష్ రానా. రితీష్ రానా మత్తు వదలరా సినిమాతో ధర్చుకుడిగా పరిచయం అయ్యాడు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పైన వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో దర్శకుడికి విపరీతమైన పేరు వచ్చింది. అందుకని అతని రెండో సినిమా హ్యాపీ బర్త్డే కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

లావణ్య త్రిపాఠి నటించిన హ్యాపీ బర్త్డే సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఎస్ఎస్ రాజమౌళి వంటి ప్రముఖులు కూడా ఈ సినిమా అప్పట్లో ప్రమోట్ చేశారు. అయితే మొత్తానికి మత్తు వదలరా 2 సినిమా చేసి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు రితీష్ రానా. కొన్నిసార్లు సీక్వెల్ అంత బాగా వర్క్ అవుట్ కాదు. కానీ ఈ సినిమాకు మాత్రం అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక ప్రస్తుతం కమెడియన్ సత్య హీరోగా జెట్లీ అనే సినిమా చేస్తున్నాడు రితీష్ రానా.

సత్య నటిస్తున్న సినిమాకు జెట్లీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విమానం పైన సత్యా కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి రేపు రియా అనే పాత్రలో కనిపించబోయే హీరోయిన్ ను పరిచయం చేస్తున్నారు. ఇది అనౌన్స్మెంట్ చేయడానికి ఒక క్రేజీ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. మత్తు వదలరా 2 సినిమాలోని రియా ఎక్కడ అనే డైలాగ్ బాబా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

మిస్ యూనివర్స్ ఇండియా హీరోయిన్‌గా పరిచయం

ఇప్పుడు అదే డైలాగును ఈ సినిమా అప్డేట్ కోసం వాడారు. రితీష్ రానా మరియు సత్యమధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. రియా ఎవరు అని అడగ్గానే మిస్ యూనివర్స్ ఇండియా అంటూ సమాధానం ఇచ్చాడు రితేష్.

Rhea evaru? Miss Universe India 😍

Aame evaru? Repu telustundi..

▶️ https://t.co/ldd54FgptH #JETLEE update tomorrow at 4.05 PM ❤‍🔥

రితీష్ రానా స్ట్రాంగ్ కంబ్యాక్

A @RiteshRana ‘s turbulence 🛫 Produced by @ClapEntrtmnt Presented by @MythriOfficial Starring #Satya , #RheaSingha , @vennelakishore Music by… pic.twitter.com/3y3nQJ1AIv

— Mythri Movie Makers (@MythriOfficial) December 9, 2025

రితీష్ అలా చెప్పగానే సత్య ఉప్పొంగిపోయాడు. వెంటనే రితీష్ హీరోయిన్ ఉంటుంది కానీ నీకు ఆవిడకి లవ్ ట్రాక్ ఉండదు అని చెబుతాడు. వీడొకడు రాడ్ సింగిల్ వాడి లైఫ్ లో లవ్వు ఉండదు వాడి సినిమాలో లవ్వు ఉండదు అంటూ ప్రస్టేట్ అవుతాడు. ఫోటో చూపించు అని అడగ్గాని రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది అంటూ షాట్ కు రెడీ అయిపోతాడు దర్శకుడు రితీష్. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటుంది.

“జెట్లీ” చిత్రంలో మిస్ యూనివర్స్ ఇండియా హీరోయిన్‌గా రావడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. సత్య, రితీష్ రానా కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం సినీ ప్రియులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా విశేషాల కోసం వేచిచూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.