|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

“జెట్లీ” రివ్యూ: సత్య సంచలనం! కమెడియన్ హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్టా? షాకింగ్ ట్విస్టులు!

Published: 01-05-2026, 5:28 PM
“జెట్లీ” రివ్యూ: సత్య సంచలనం! కమెడియన్ హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్టా? షాకింగ్ ట్విస్టులు!
  • కమెడియన్ సత్య హీరోగా ‘జెట్లీ’ సంచలనం! తొలిరోజే భారీ వసూళ్లకు ఛాన్స్!
  • మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో రితేష్ రానా డైరెక్షన్! బ్లాక్‌బస్టర్ కాంబో మ్యాజిక్!
  • వెన్నెల కిషోర్, రియా సింగ్ కీలక పాత్రల్లో! సినిమాకు అదిరిపోయే ట్విస్టులు, కామెడీ!
  • బ్యాంక్ స్కామ్, మెమరీ లాస్ థ్రిల్లర్! సత్య నటనకు ఫ్యాన్స్ ఫిదా!

కమెడియన్ సత్య హీరోగా నటించిన “జెట్లీ” సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది! రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సత్య నటన, వెన్నెల కిషోర్ కామెడీతో కూడిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం!

సత్యకు మాస్ హిట్ పడిందా? రివ్యూ హైలైట్స్!

కమెడియన్ సత్య హీరోగా వెన్నెల కిషోర్, రియా సింగ్, అజయ్, కబీర్ సింగ్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా జెట్లీ. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మాణంలో రితేష్ రానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జెట్లీ సినిమా నేడు మే 1న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

ప్రజాపతి(అజయ్) తన బ్యాంక్ దివాలా తీసింది అని చెప్పి ఆ డబ్బుతో పారిపోతాడు. వెళ్ళేటప్పుడు ఆ బ్యాంకు ఇంకో హెడ్ అయిన హరిచంద్ర ప్రసాద్(శుభలేఖ సుధాకర్) ని చంపేస్తాడు. డబ్బులు అన్ని దోచుకున్నాడని జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరోవైపు హోమ్ మినిస్టర్ కూడా ప్రజాపతిని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ప్రజాపతిని చంపడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. ఒక ఆరు నెలల తర్వాత ప్రజాపతి లొంగిపోతానని ఇండియాకి తిరిగి రావడానికి ఏజెంట్ శివాని రాయి(రియా సింగ్),ఆమె టీం సపోర్ట్ తీసుకుని దుబాయ్ నుంచి ఫ్లైట్లో బయలుదేరుతాడు.

ఇదే ఫ్లైట్లో అతన్ని చంపడానికి కొంతమంది, అతని మనుషులు కొంతమంది ఉంటారు. డాక్టర్ వేద వ్యాస్(సత్య) కూడా ఇదే ఫ్లైట్లో ఉంటాడు. అయితే అతను ఎవరు అనేది మర్చిపోయి చుట్టూ ఉన్నవాళ్లు చెప్పే దాన్ని బట్టి తనను తాను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరి అసలు వేదవ్యాస్ ఎవరు? వేదవ్యాస్ ప్రజాప్రతిని చంపడానికి వచ్చాడా? కాపాడడానికి వచ్చాడా? ప్రజాపతిని ఎవరు చంపుతారు? జనాల దగ్గర నుంచి పోయిన డబ్బు తిరిగి వస్తుందా? అసలు ఫ్లైట్లో ఉన్న వాళ్లంతా ఎవరు? వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

కమెడియన్ సత్య, డైరెక్టర్ రితేష్ రానా కాంబోలో వచ్చిన మత్తు వదలరా రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలను నెలకొన్నాయి. ఫస్ట్ అఫ్ అంతా ప్రజాపతి పాత్ర గురించి చూపించి తను దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగి రావడం, ఫ్లైట్లో ఉండడం, ఫ్లైట్ లో ఉన్న జనాలు, వాళ్ల పాత్రల గురించి చూపిస్తారు. సత్య తనని తాను మర్చిపోయినట్టు, తనపై దాడి జరిగినట్టు, అతను ఎవరో గుర్తుతెచ్చుకునే ప్రాసెస్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా అక్కడక్కడ కామెడీ డైలాగ్స్ తో, స్పూఫ్ సీన్స్ తో సాగుతుంది.

బ్యాంక్ స్కామ్, ఫ్లైట్ మిస్టరీ: అసలు కథేంటి?

ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. ఈ బ్యాంకు స్కామ్ ఏంటి సత్య అసలు ఎలా వచ్చాడు? సత్య ఎవరు? వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి? అని కథతో పాటు అక్కడక్కడ కామెడీ నడిపించారు. సినిమాలో పెద్ద కథ లేకపోయినా సత్యని, వెన్నెల కిషోర్ ను పెట్టుకొని కామెడీ సీన్స్ తోటి నడిపించారు. చాలా చోట్ల సినిమా బోర్ కొడుతుంది, కొన్ని చోట్ల ఇది కామెడీనా అనిపిస్తుంది.

సినిమా అంతా 95% ఒక ఫ్లైట్ లోనే జరగడంతో సినిమా అక్కడక్కడే చుట్టేసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక లాజిక్స్ అయితే వెతకకూడదు. లాజిక్స్ లేకుండా కేవలం కామెడీ కోసమే చాలా సీన్స్ ఉంటాయి. సత్య కామెడీ సినిమా కాబట్టి అవేమీ ఆలోచించకుండా కేవలం నవ్వుకోవడం కోసం మాత్రమే సినిమా చూడాలి. హాలీవుడ్ స్టైల్ లో యాక్షన్ కామెడీ సినిమా తీద్దాం అనుకున్నారు. కానీ దాంట్లో స్పూఫ్ కామెడీ మిక్స్ చేసి అక్కడక్కడ బోరింగ్ గా, అక్కడక్కడ పంచ్ డైలాగ్స్ తో సత్య, వెన్నల కిషోర్ హావ భావాలతో నవ్వించే లాగా తెరకెక్కించారు. అయితే జెట్లీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో, సినిమాలో ఆ పేరు ఎక్కడ వస్తుందో దర్శకుడికే తెలియాలి.

సత్యకి ఏ పాత్ర ఇచ్చిన తన కామెడీతో, తన హవ భావాలతో అదరగొడతాడని తెలిసిందే. ఇందులో కూడా సత్య అదరగొట్టాడు. వెన్నెల కిషోర్ కూడా సత్య పక్కనే ఉంటూ నవ్వించాడు. హీరోయిన్ రియాసింగ్ ఏజెంట్ పాత్రలో పర్వాలేదనిపించింది. వ్యాపారవేత్తగా అజయ్ కూడా బాగా నటించాడు. గుండు సుదర్శన్, వైవాహర్ష బాగా నవ్వించారు. వడ్లమాని శ్రీనివాస్, శుభలేఖ సుధాకర్, కబీర్ సింగ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

మొదటి భాగం బోరింగ్.. రెండో భాగం టెన్షన్!

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సినిమాలో ఆల్మోస్ట్ ఒక ఫ్లైట్లో కథ జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫ్లైట్ సెట్ కోసం చాలా బాగా కష్టపడ్డారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సింపుల్ కథ తీసుకొని స్పూఫ్ కామెడీ, పంచ్ డైలాగ్స్ ఆధారంగా డైరెక్టర్ ఈ సినిమాని నవ్వుకోడానికి మాత్రమే తెరకెక్కించాడు. నిర్మాణపరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా జెట్ లీ సినిమా అక్కడక్కడా కాసేపు సత్య, వెన్నెల కిశోర్, కొంతమంది నటీనటుల పెర్ఫార్మెన్స్ చూసి నవ్వుకోవడానికి మాత్రమే. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

మొత్తంగా “జెట్లీ” సినిమా సత్య కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చేలా ఉంది. థ్రిల్లింగ్ కథ, కామెడీ, ట్విస్టులతో నిండిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.