
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 4వ ఎపిసోడ్ అద్భుతమైన ట్విస్టులతో నిండి ఉంది. రాజ్‌కు మరో కారు ప్రమాదం, రాహుల్ స్మగ్లింగ్‌లో చిక్కుకుని, రుద్రాణి బానిసగా మారడం వంటి సంఘటనలు ఈ ఎపిసోడ్‌లో చోటు చేసుకున్నాయి. కావ్య గర్భవతి అని తెలియడం మరో ముఖ్య విషయం.
Key Points
రాజ్‌కు మరో కారు ప్రమాదం!
రాహుల్ కారులో స్మగ్లింగ్ వస్తువులు!
రుద్రాణి బానిస జీవితం!
కావ్య గర్భవతి అని తెలుసుకున్న అప్పు!
రాజ్‌కు కారు ప్రమాదం & గతం గుర్తు
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్యకు తాను ప్రెగ్నెంట్ అని తెలిసి బాధపడుతుంది. ఇంతలో అప్పు వస్తే కావ్య హగ్ చేసుకుని బాధపడుతుంది. ఇదేంటీ చేతిలో అని ప్రెగ్నెన్సీ కిట్ చూసి అప్పు కూడా చాలా సంతోషిస్తుంది. ఇది నిజమా అక్కా అని అప్పు అంటే అవును, నేను తల్లిని కాబోతున్నాను అని కావ్య అంటుంది. కంగ్రాట్స్ అని చెప్పి హగ్ చేసుకున్న అప్పు అసలు బావ మీరు ఎప్పుడు కలిసారు అని అడుగుతుంది.
రెండు నెలల ముందు ఆయనకు గతం మర్చిపోకముందు బూత్ బంగ్లాలో కలుసుకున్నాం అని కావ్య చెబుతుంది. ఈ విషయం అందరికి చెప్పి సెలబ్రేట్ చేసుకుందాం అని అప్పు అంటే ఆయన నాకు ప్రపోజ్ చేద్దామని చాలా సంతోషంగా వస్తున్నారు. దీనికి కారణం మీరే అని చెప్పాలా. అసలు నేను చెప్పగలనా. ఆయనకు నిజం తెలియాలంటే గతం గుర్తుకురావాలి. అలా చేస్తే సమస్య అని డాక్టర్ చెప్పారు అని కావ్య అంటుంది.
బావ ప్రపోజ్ చేశాక ఈ విషయం తెలిస్తే ఎలా అని అప్పు అంటే.. ఆయన్ను మోసం చేయలేను. అలా అని సాహసం చేయలేను. ఈ విషయం ఎవరికి చెప్పకు. మందు అయితే రేవతి గారి కొడుకును వాళ్ల ఇంట్లో వదిలేసి రా అని అప్పును పంపిస్తుంది కావ్య. స్వరాజ్‌ను కారులో అప్పు తీసుకెళ్తుంది. స్పీడ్‌గా తీసుకెళ్లమని స్వరాజ్ గోల చేస్తాడు. అప్పును రాహుల్ ఫాలో అవుతాడు.
అది అప్పు గమనించిన అప్పు ఆ రుద్రాణికి ఈ బాబు గురించి అనుమానం వచ్చి ఫాలో చేయమని చెప్పిందా. చెబుతాను అని కానిస్టేబుల్ శేషుకు కాల్ చేసి ఓ ప్లాన్ చెబుతుంది అప్పు. మేము చూసుకుంటాం అని శేషు అంటాడు. కారును ఫాస్ట్‌గా నడపమని రాహుల్‌ను తప్పించుకుని వెళ్లిపోతుంది. రాహుల్ కారుకు ఎదురు వచ్చిన శేషు మీ కారులో స్మగ్లింగ్ ఐటమ్స్ ఉన్నాయి చెక్ చేయాలి అని రాహుల్‌ను దిగమంటాడు.
రాహుల్ కారులో స్మగ్లింగ్
కారు అంతా చెక్ చేసి ఏం లేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అని శేషు చెబుతాడు. అలా రాహుల్‌ను ఆపేస్తుంది అప్పు . ఈ విషయం ఎలా మామ్‌కు చెప్పాలి అని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు మన గోల్డెన్ డేస్ అయిపోయాయి. యామిని కూడా చేతులెత్తేసింది. వాళ్లిద్దరు ఒక్కటైపోతారు. మేము బానిసల్లా బతకాల్సిందే అని రుద్రాణి అనుకుంటుంది.
ఇంతలో రాజ్ వస్తాడు. హడావిడి చేస్తాడు. అందరూ సంతోషంగా మాట్లాడుతారు. కళావతి గారు అని రాజ్ పిలిస్తే కావ్య కన్నీళ్లు తుడుచుకుని కిందకు వస్తుంది. కళావతి గారు ఇంకా ఆగడం నా వల్ల కాదు. మనసులో ప్రేమను ఉంచుకుని ఫ్రెండ్‌లా నటించాను. మీకు కూడా అలాగే ఉందని నాకు తెలుసు. కానీ, వీళ్లందరి ముందు కన్ఫర్మ్ చేసుకొందామని చెబుతున్నాను అని రాజ్ అంటాడు.
మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరే నా జీవితం అనిపించింది. మీరు లేకుంటే నాకు లైఫే లేదనిపిస్తుంది. మీతో కలిసి జీవితాంతం బతకాలి. ఏడడుగులు కలిసి వేయాలి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని రాజ్ అడుగుతాడు. దాంతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి ఏంటండి అవి అని రాజ్ అంటాడు. నువ్ ఎప్పుడు చెబుతావా అని ఎదురుచూసి తన బాధ పోయేసరికి కన్నీళ్లు పెట్టుకుంటుంది అని ఇందిరాదేవి అంటుంది.
రుద్రాణి బానిసత్వం
అందరూ పెళ్లి గురించి మాట్లాడుతారు. ఇప్పుడు పెళ్లి ఎక్కడ జరగాలి, ఎలా జరగాలో నువ్వే చెప్పాలి అని కావ్యను అంటుంది ఇందిరాదేవి. దాంతో ఇకచాలు ఆపుతారా. ఆయన చెప్పగానే పెళ్లి ఎలా చేయాలనేవరకు వెళ్లిపోయారు. నన్ను అడగరా. ఆయనంటే నాకు ఇష్టమని మీకు చెప్పానా. అసలు నేను పెళ్లికి ఒప్పుకున్నానా. ఆయన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని కావ్య అంటుంది.
దాంతో అంతా షాక్ అవుతారు. ఇదేం ట్విస్టురా బాబు ఇది నేను ఊహించలేదు అని రుద్రాణి సంతోషిస్తుంది. జోక్ చేయకు అని ధాన్యం అంటే నా జీవితం మీద నేనేందుకు జోక్ చేసుకుంటాను అని కావ్య అంటుంది. దాంతో రాజ్ బాధతో ఇంటికి తిరిగివెళ్లిపోతాడు. కావ్యతో గడిపింది, ప్రేమని తిరస్కరించింది అంతా చీకట్లో నడుస్తూ గుర్తు చేసుకుంటాడు రాజ్.
ఇంతలో రాజ్‌ను వెనుక నుంచి ఓ కారు వచ్చి గుద్దుతుంది. మరోసారి రాజ్‌కు యాక్సిడెంట్ అవుతుంది. అటు పక్కకు పడిపోతాడు రాజ్. ఈ యాక్సిడెంట్‌లో రాజ్‌కు గతం గుర్తుకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో చూపించిన ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజ్‌కు గతం గుర్తుకు వస్తుందా? రుద్రాణి బానిసత్వం నుండి ఎలా బయటపడుతుంది? వచ్చే ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూద్దాం.


