|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సునామీ: విడుదల కాకముందే రూ.55 కోట్ల రికార్డు డీల్!

Published: 23-02-2026, 3:05 AM
నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సునామీ: విడుదల కాకముందే రూ.55 కోట్ల రికార్డు డీల్!
  • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘డ్రాగన్’.
  • సినిమా విడుదల కాకముందే 55 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.
  • నార్త్ అమెరికా, యూకే హక్కుల కోసం ఈ డీల్ కుదిరింది.
  • టాలీవుడ్ చరిత్రలో ఇది ఒక అరుదైన ఓవర్సీస్ డీల్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా విడుదల కాకముందే నార్త్ అమెరికా, యూకే హక్కుల కోసం ఏకంగా 55 కోట్ల రూపాయల బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలో ఇదొక రికార్డు.

విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’

Jr NTR Neel film: ఆర్ఆర్ఆర్, దేవర వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR) మధ్యలో హిందీలో వార్ 2 చిత్రం చేసి కాస్త డీలాపడినా.. ఇప్పుడు ‘కేజీఎఫ్’ చిత్రాలతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. ఇలాంటి సమయంలో వచ్చిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా నుండి ఎలాంటి పోస్టర్ కానీ ప్రోమో కానీ విడుదల కాకముందే ఈ సినిమాకి ఊహించని డీల్ కుదరడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిలిం వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ , ప్రశాంత్ నీల్ బ్రాండ్ వాల్యూ చూసి డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నార్త్ అమెరికా తో పాటు యూకే హక్కుల కోసం సుమారుగా 55 కోట్ల అడ్వాన్స్ కుదిరినట్లు సమాచారం. ఇకపోతే టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక అరుదైన అతిపెద్ద ఓవర్సీస్ డీల్ గా పరిగణించబడుతోంది.

ఓవర్సీస్ హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు

దీనికి తోడు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కేవలం బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడి , పుష్ప 2 చిత్రాలు మాత్రమే నార్త్ అమెరికాలో 10 డాలర్ మిలియన్ మార్కును దాటగలిగాయి.. ఇప్పుడు డ్రాగన్ కూడా అదే బాటలో పయనిస్తూ విడుదలకు ముందే ఆ స్థాయి బిజినెస్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇకపోతే ఓవర్సీస్ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా ఊహించని బిజినెస్ చేస్తుందని అటు ట్రేడ్ అనలిస్టులు కూడా అంచనా వేస్తున్నారు.. అసలు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటకు రాకుండానే.. ఈ రేంజ్ లో బిజినెస్ జరిగింది అంటే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.. ఒకవేళ ఈ టీజర్ గనుక రికార్డ్ సృష్టించింది అంటే మాత్రం ఇక ఊహించని బిజినెస్ దక్కించుకుంటుంది అనడంలో సందేహం లేదు.

టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు

ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వార్ 2 సినిమాతో అభిమానులను నిరాశపరిచిన ఎన్టీఆర్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని పరితపిస్తున్నారు. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. అటు ప్రశాంత్ నీళ్ కూడా ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ కాంబో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

మొత్తానికి ఎన్టీఆర్ సినిమా విడుదల కాకముందే ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తే మరింత రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.