|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ దానం చేసిన సినిమా గోపీచంద్ పాలిట వరమైంది! ఊహించని సంచలనం!

Published: 30-01-2026, 9:05 AM
ప్రభాస్ దానం చేసిన సినిమా గోపీచంద్ పాలిట వరమైంది! ఊహించని సంచలనం!
  • ప్రభాస్ చేతికి వచ్చిన సినిమాను గోపీచంద్‌కు ఇవ్వడంతో అది సూపర్ హిట్ అయింది.
  • గోపీచంద్ నటించిన ‘జిల్’ సినిమా 2014లో విడుదలైంది.
  • ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
  • యువి క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రభాస్ సలహాలు, సూచనలు ఇస్తుంటాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకప్పుడు తన చేతికి వచ్చిన సినిమాను తన స్నేహితుడైన గోపీచంద్‌కు ఇచ్చాడు. ఆ సినిమా విడుదల అయ్యాక సూపర్ హిట్ అయింది. ఆ సినిమా మరేదో కాదు ‘జిల్’.

ప్రభాస్ పాన్ ఇండియా ప్రయాణం

Prabhas: ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతోంది. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాహుబలి, కల్కి లాంటి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానం మరింత బలపరుచుకున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఫౌజీ, స్పిరిట్, సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2 వంటి భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

గోపీచంద్ కెరీర్‌లో జిల్ సినిమా

ఇదిలా ఉంటే ప్రభాస్‌కు చాలా సన్నిహితుడైన గోపీచంద్ పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. సిటీ మార్ తర్వాత గోపీచంద్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఆరడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా వంటి సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. కొద్ది సంవత్సరాల ముందు విడుదలైన విశ్వం సినిమా మాత్రం యావరేజ్‌గా నిలిచింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ గోపీచంద్ కెరీర్‌ను కొంచెం గాడిలో పెట్టిందని చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం మళ్లీ ఫ్లాప్ అయ్యాయి..

ఇక ప్రభాస్‌కు చెందిన యువి క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బ్యానర్‌లో తెరకెక్కే సినిమాల్లో ప్రభాస్ నేరుగా నటించకపోయినా.. కథల విషయంలో ఆయన సూచనలు, సలహాలు తప్పక ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. అలా సుమారు పది సంవత్సరాల క్రితం ఒక కొత్త దర్శకుడు ఒక కథతో ప్రభాస్‌ను కలిశాడట. కథ బాగా నచ్చినా, అప్పట్లో బాహుబలి షూటింగ్‌తో బిజీగా ఉండటంతో ప్రభాస్ ఆ దర్శకుడిని వేచి పెట్టడం ఇష్టం లేక..అదే కథను తన స్నేహితుడు గోపీచంద్‌కు చేయమని సూచించాడట.

యువి క్రియేషన్స్ పాత్ర

గోపీచంద్ కూడా కథ విని వెంటనే ఓకే చెప్పాడట. ఆ సినిమా త్వరగా పట్టాలెక్కి, విడుదలై సూపర్ హిట్ అయింది. గోపీచంద్ లుక్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ సినిమా మరేదో కాదు… 2014లో విడుదలైన జిల్. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. తరువాత ఇదే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధేశ్యామ్ చేశాడు. అయితే ఆ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ప్రభాస్ తన స్నేహితుడికి అవకాశం ఇవ్వడం ద్వారా గోపీచంద్ కెరీర్‌కు ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది. జిల్ సినిమా గోపీచంద్ సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.