|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాళ్లిద్దరూ చేసింది నచ్చక షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ.ఎన్టీఆర్, భరించలేని అవమానం.. నాగ్ కూడా హ్యాండిచ్చారు

Published: 25-10-2025, 9:57 AM
వాళ్లిద్దరూ చేసింది నచ్చక షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ.ఎన్టీఆర్, భరించలేని అవమానం.. నాగ్ కూడా హ్యాండిచ్చారు

ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌లు తమ కెరీర్ ఆరంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలలో వారికి జరిగిన అవమానాలు, తొలగింపు వంటి ఘటనలు వారిని ఎలా ప్రభావితం చేశాయో వివరించారు. ఈ సంఘటనల గురించి పూర్తి వివరాలు ఇక్కడ.

Key Points

1

రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కంత్రి షూటింగ్‌లో ఎన్టీఆర్ చేసిన పనికి అవమానం పొందారు.

2

తాము చేసిన కొరియోగ్రఫీ నచ్చక జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయారు.

4

నాగార్జున తొలగించినా ఫుల్ పేమెంట్ ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నారు.

ఎన్టీఆర్ తో కంత్రి సమయంలో జరిగిన అవమానం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మూవీ సెట్ లో తమకి అవమానం జరిగింది అని ఇద్దరు క్రేజీ ఫైట్ మాస్టర్లు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. కానీ ఆ అవమానాలు, కష్టాలు అధికమించడం వల్లే తాము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని ఆ ఫైట్ మాస్టర్స్ తెలిపారు. టాలీవుడ్ లో చాలా కాలంగా రాణిస్తున్న ఆ ఫైట్ మాస్టర్స్ ఇద్దరూ రామ్, లక్ష్మణ్ లు.

ఈ ఇద్దరు కవల సోదరులు మాస్ యాక్షన్ ఫైట్స్ కి పెట్టింది పేరు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ స్టంట్ కొరియోగ్రఫీ చేస్తున్నారంటే ఆ సినిమాతో మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ బావగారు బాగున్నారా మూవీ టైం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తమకి కెరీర్ లో ఎదురైన అవమానాల గురించి రామ్ లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

నాగార్జున విషయంలో రామ్ లక్ష్మణ్ అనుభవం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రంలో ఒక చిన్న సీక్వెన్స్ కి ఫైట్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. సినిమా మొత్తం మరో ఫైట్ మాస్టర్ చేస్తున్నారు. ఆ చిన్న సీక్వెన్స్ కి మాత్రమే మమ్మల్ని తీసుకున్నారు. కానీ మేము చేసింది తారక్ బాబుకి నచ్చలేదు. వెంటనే షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అన్నారు. ఆ క్షణం జరిగిన అవమాననానికి కళ్ళలో నీళ్లు వచ్చాయి అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎమోషనల్ అయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి చిత్రం ఫ్లాప్ అయింది.

డైరెక్టర్ విఎన్ ఆదిత్య, నాగార్జున కాంబినేషన్ లో నేనున్నాను, బాస్ లాంటి చిత్రాలు వచ్చాయి. అయితే రామ్ లక్ష్మణ్ మాస్టర్ సినిమా పేరు చెప్పలేదు కానీ.. వీరి కాంబోలో వచ్చిన ఒక చిత్రానికి తామే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా ఎంపిక అయ్యాం అని తెలిపారు. మా వర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది.

కష్టాలు అధిగమించి టాప్ ఫైట్ మాస్టర్లుగా

రోప్స్ ఎక్కువగా వాడాలని చెప్పాం. దీనితో నాగార్జున గారు ఇబ్బంది పడతారని మమ్మల్ని ఆ మూవీ నుంచి తొలగించారు. కానీ నాగార్జున మాత్రం గొప్ప మనసు చాటుకున్నారు. మమ్మల్ని ఆల్రెడీ ఎంపిక చేశారు కాబట్టి ఫుల్ పేమెంట్ ఇచ్చి పంపించినట్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తెలిపారు.

మొత్తంగా, రామ్ లక్ష్మణ్‌ మాస్టర్ల ప్రస్థానం కష్టాలు, అవమానాలతో కూడుకున్నదని, వాటిని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారని తెలుస్తోంది. నాగార్జున గొప్ప మనసు, ఎన్టీఆర్ అసంతృప్తి వారి జీవితంలో కీలక మలుపులు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.