
కిరీటి, శ్రీలీల నటించిన జూనియర్ సినిమా ఓటీటీ విడుదల వివరాలు వెలువడ్డాయి. నమ్మఫ్లిక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 22 నుంచి ప్రసారం కానుంది. జెనీలియా కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.
Key Points
జూనియర్ సినిమా సెప్టెంబర్ 22 నుండి నమ్మఫ్లిక్స్ లో స్ట్రీమింగ్.
ఆహా ఓటీటీలో కూడా జూనియర్ త్వరలోనే రానుంది.
జెనీలియా దీనితో తెలుగు తెరకు తిరిగి వచ్చారు.
వైరల్ అయిన 'వయ్యారి' సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.
జూనియర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్
జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఎప్పుడొస్తుందనేది కూడా తేలిపోయింది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత జూనియర్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇది ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటికి డెబ్యూ మూవీ.
జూనియర్ మూవీ ఇప్పటికే ఆహా ఓటీటీ లోకి రాబోతుందనే సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ పోస్టర్ పంచుకుంది. కమింగ్ సూన్ అంటూ అనౌన్స్ చేసేసింది. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు జూనియర్ సినిమా మరో ఓటీటీలోకి కూడా రాబోతుంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
నమ్మఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
కిరీటి, శ్రీలీల జంటగా నటించిన జూనియర్ మూవీ మరో ఓటీటీలోకి కూడా రాబోతుంది. సెప్టెంబర్ 22 నుంచి నమ్మఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది కన్నడ ఓటీటీ యాప్. జూనియర్ మూవీ తెలుగు, కన్నడలో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో ఆహాలో, కన్నడలో నమ్మఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
జూనియర్ మూవీ ఓటీటీలోకి కమింగ్ సూన్ అంటూ ఆహా ప్లాట్ ఫామ్ పోస్టర్ షేర్ చేసింది. కానీ డేట్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నమ్మఫ్లిక్స్ ఏమో సెప్టెంబర్ 22 నుంచి జూనియర్ తమ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే ఆహాలోనూ అదే రోజు నుంచి ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
జెనీలియా రీ ఎంట్రీ
హా హా హాసిని అంటూ తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకున్న జెనీలియా చాలా కాలం తర్వాత జూనియర్ మూవీతో ఇక్కడ రీ ఎంట్రీ ఇచ్చింది. రాధాకృష్ణ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కిరీటీ, శ్రీలీల లీడ్ రోల్స్ ప్లే చేశారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొరపాటి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. జూనియర్ సినిమాలోని వైరల్ వయ్యారి సాంగ్ తెగ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.
తండ్రి పెంపకం నుంచి కాస్త దూరంగా గడపొచ్చని కాలేజీలో చేరతాడు అభినవ్. నాలుగేళ్ల ఇంజినీరింగ్ డిగ్రీలో మెమోరీస్ ఏర్పరుచుకోవడానికి గడిపేస్తాడు. అక్కడే స్ఫూర్తిని ప్రేమిస్తాడు. స్ఫూర్తి కోసం ఒకే కంపెనీలో జాయిన్ అవుతాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ సౌజన్యకు అభి నచ్చడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
చివరగా, జూనియర్ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. నమ్మఫ్లిక్స్ మరియు ఆహా ఓటీటీలలో సినిమా విడుదల కానుంది. జెనీలియా రీ ఎంట్రీ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.


