
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన ‘కాంత’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ కార్యక్రమంలో నటుడు రానా దగ్గుబాటి హీరోయిన్ భాగ్యశ్రీని టాలీవుడ్‌కు పరిచయం చేసింది తామేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Key Points
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన కాంత ట్రైలర్ విడుదల.
భాగ్యశ్రీని టాలీవుడ్‌కు పరిచయం చేసింది తామేనని రానా దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు.
భాగ్యశ్రీ ఇప్పటికే తెలుగులో మిస్టర్ బచ్చన్, కింగ్‌డమ్ వంటి సినిమాలు చేసింది.
కాంత ట్రైలర్ విడుదల: సినిమా విశేషాలు
దిశ, వెబ్ డెస్క్: దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan) హీరోగా భాగ్యశ్రీ ( Bhagyashri Borse) హీరోయిన్ గా నటించిన సినిమా కాంత. ఈ సినిమాలో సముద్రగని, రానా కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడుగా పనిచేస్తుండగా రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి నిర్మాతలుగా ఉన్నారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇందులో దుల్కర్ సల్మాన్ చెప్పే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీని టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చింది తామేనని రానా వెల్లడించారు. మొదట ఆమె టాలెంట్ గుర్తించి ఇండస్ట్రీకి తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. అయితే తమ సినిమా షూటింగ్ కాస్త లేట్ కావడంతో… తెలుగులో చాలా సినిమాలే ఆమె ఫినిష్ చేసిందని పేర్కొన్నారు. దీంతో అక్కడే ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ పగలబడి నవ్వారు. కాగా 2023లో బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ…తెలుగులో మిస్టర్ బచ్చన్, కింగ్‌డమ్ చేశారు.
భాగ్యశ్రీ ఎంట్రీపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు
భాగ్యశ్రీ టాలీవుడ్ ప్రాజెక్టులు
రానా దగ్గుబాటి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి. భాగ్యశ్రీ ప్రతిభను గుర్తించి తెచ్చింది తామేనని రానా చెప్పడం ఆమె భవిష్యత్తుకు మరింత బూస్ట్‌నిచ్చింది. నవంబర్ 14న విడుదలయ్యే కాంత సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


