|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kajal Aggarwal: రామాయణంలో ఛాన్స్ కొట్టేసిన కాజల్?

Published: 16-05-2025, 6:56 AM
Kajal Aggarwal: రామాయణంలో ఛాన్స్ కొట్టేసిన కాజల్?

రామాయణం ఆధారంగా తీస్తున్న కొత్త హిందీ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ లాంటి నటీనటులు ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్నారు.

Key Points

1

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న కొత్త హిందీ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉంది.

2

మండోదరి పాత్ర కోసం కాజల్ పేరు వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

4

2026 దీపావళికి మొదటి భాగం, 2027లో రెండవ భాగం విడుదల కానున్నాయి.

రామాయణం సినిమా: కొత్త వార్తలు

రామాయణం ఆధారంగా మన దేశంలో చాలా సినిమాలు ఇదివరకే తీశారు. తీస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఇలానే తీశారు. కానీ గ్రాఫిక్స్, పాత్రల తీరుతెన్నులు దారుణంగా ఉండేసరికి విపరీతమైన విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఇ‍ప్పుడు ‘రామాయణ్’ పేరుతో హిందీలో మళ్లీ సినిమా తీస్తున్నారు.

ఇ‍ప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో ‘యానిమల్’ ఫేమ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్ర చేస్తోంది. ‘కేజీఎఫ్’ యష్ రావణుడిగా నటిస్తున్నాడు. మిగిలిన పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా బయటపెట్టలేదు.

కాజల్ అగర్వాల్ పాత్ర: ఊహాగానాలు

ప్రస్తుతానికైతే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. రావణుడి భార్య పేరు మండోదరి. రామాయణ్ మూవీలో ఈమె పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. మరి కాజల్ నిజంగా ఒప్పుకొందా? లేదంటే ఇవి రూమర్స్ మాత్రమేనా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు.

సినిమా విడుదల తేదీలు

నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027లో రెండో భాగం రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీతో దర్శకనిర్మాతలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి?

(ఇదీ చదవండి : రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు )

కాజల్ అగర్వాల్ నిజంగా ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే. ఈ సినిమా ద్వారా దర్శకనిర్మాతలు ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.