|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేయూ గుడ్ న్యూస్! దూర విద్య ప్రవేశాల ప్రకటన – మీ భవిష్యత్తుకు బాటలు!

Published: 03-04-2026, 8:05 AM
కేయూ గుడ్ న్యూస్! దూర విద్య ప్రవేశాల ప్రకటన - మీ భవిష్యత్తుకు బాటలు!
  • కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 10 చివరి తేదీ; ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • బీకాం, బీబీఏ, ఎంఏ, ఎంకాం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • సందేహాల కోసం 0870-2461480/2461490 నెంబర్లను సంప్రదించవచ్చు.

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ మరియు డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

కేయూ దూర విద్య ప్రవేశ ప్రకటన వివరాలు

వరంగల్ కాకతీయ యూనివర్శిటీ దూర విద్యలో ప్రవేశాలకు కొత్త నోటిఫికేషన్ (ఫిబ్రవరి సెషన్ – 2026) జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

నిర్ణయించిన దరఖాస్తు ఫీజు లేదా కోర్సు ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవచ్చు. కోర్సుల ఫీజు వివరాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

కేయూ దూర విద్యలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా వేర్వురు కాంబినేషన్లు ఉండటంతో… అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించి కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. https://sdlceku.co.in/pdf/Poster_2026.pdf లింక్ పై క్లిక్ చేసి కోర్సులకు సంబంధించిన అన్ని వివరాలు, అర్హతలను తెలుసుకోవచ్చు.

అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలు

ఫిబ్రవరి సెషన్ – 2026 కు సంబంధించి బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ బీఎల్ఐసీ (వ్యవధి: మూడేళ్లు.) వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఇక పీజీ కోర్సులు చూస్తే ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్) ఉన్నాయి. వీరి కాల వ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. డిప్లోమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఓరియంటల్ కోర్సులు కూడా ఉన్నాయి.

దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు

ఏమైనా సందేహాలు ఉంటే 0870- 2461480, 2461490 నెంబర్లను సంప్రదించవచ్చు. [email protected] కు కూడా మెయిల్ చేయవచ్చు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా విద్యనభ్యసించాలని అనుకునేవారికి ఇది మంచి అవకాశం. త్వరగా దరఖాస్తు చేసుకొని మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోండి. సందేహాలుంటే సంప్రదించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.