|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘కల్కి 2’ నుండి తప్పుకున్న క్రేజీ ప్రొడ్యూసర్స్! ప్రభాస్ కు బిగ్ షాక్!!

Published: 13-04-2026, 11:35 AM
షాకింగ్: 'కల్కి 2' నుండి తప్పుకున్న క్రేజీ ప్రొడ్యూసర్స్! ప్రభాస్ కు బిగ్ షాక్!!
  • ప్రభాస్ ‘కల్కి 2’ నుండి మైత్రి మూవీ మేకర్స్ తప్పుకున్నారా?
  • స్పిరిట్ మూవీ థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసిన మైత్రి.
  • పౌజీ మూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్.
  • రాజా సాబ్ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆచితూచి అడుగులు వేస్తున్న నిర్మాతలు.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, కల్కి 2 విషయంలో ఒక సంచలన వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే…

కల్కి 2 నుండి తప్పుకున్న మైత్రి?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌజీ చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్, అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి పార్ట్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈయన నటిస్తున్న అన్ని చిత్రాల్లో ఏదో ఒక రకంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న స్పిరిట్ మూవీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను భారీ ధరకు మైత్రి సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే పౌజీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి పార్ట్ 2’ విషయంలో మాత్రం ఈ సంస్థ పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదని టాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఇటీవల సంక్రాంతికి ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ చిత్రం మంచి అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరి ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఈ మూడు చిత్రాలపై మాత్రం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు ఏ స్థాయి విజయాలను అందుకుంటాయో చూడాలి.

స్పిరిట్ హక్కులు కొన్న మైత్రి మూవీస్

రాజా సాబ్ ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గిన నిర్మాతలు?

ప్రభాస్ సినిమాలపై వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. కల్కి 2 భవిష్యత్తు ఏమవుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.