|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిల్ రాజు సంచలనం! ‘టాక్సిక్’ కోసం అన్ని కోట్లా? ట్రేడ్ పండితులు షాక్!

Published: 13-02-2026, 2:05 AM
దిల్ రాజు సంచలనం! 'టాక్సిక్' కోసం అన్ని కోట్లా? ట్రేడ్ పండితులు షాక్!
  • యాష్ ‘టాక్సిక్’ మూవీ తెలుగు హక్కులు దక్కించుకున్న దిల్ రాజు – భారీ మొత్తం!
  • తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’ విడుదల హక్కులు ఏకంగా 120 కోట్లకు కొనుగోలు!
  • దిల్ రాజు కొనుగోలుపై అనుమానాలు వ్యక్తం చేసిన ట్రేడ్ పండితులు, అసలు నిజం ఏమిటి?
  • బ్యాంకు నుండి డబ్బు పంపాక తెలుస్తుంది: దిల్ రాజు సంచలన సమాధానం!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కన్నడ స్టార్ యాష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ తెలుగు హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. ఈ డీల్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.

120 కోట్లకు ‘టాక్సిక్’ హక్కులు కొన్న దిల్ రాజు

నిర్మాతగా, పంపిణీదారునిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన వరుస పెట్టి సినిమాలను నిర్మించడమే కాకుండా అనేక భారీ, చిన్న సినిమాలను విడుదల కూడా చేస్తున్నాడు. తాజాగా ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాడు. కన్నడ స్టార్ నటుడు యాష్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీని మార్చి 19వ తేదీనే తెలుగు భాషలో కూడా విడుదల చేయనున్నారు. కాగా మూవీ విడుదల తేదీనే ధురంధర్ 2 మూవీ కూడా విడుదల కానుంది.

దిల్ రాజు కొనుగోలుపై ట్రేడ్ పండితుల అనుమానాలు

ఆ తర్వాత వారం రోజులకే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కానుంది. దీంతో టాక్సిక్ చిత్రానికి హిందీ, తెలుగు మార్కెట్ నుండి గట్టి పోటీ ఎదురవుతుంది, సూపర్ సాలిడ్ టాక్ వస్తే తప్ప ఈ రెండు ప్రాంతాల్లో గట్టి కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టలేదు అని చాలామంది ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఇలాంటి సమయంలో దిల్ రాజు టాక్సిక్ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఏకంగా 120 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. దాంతో చాలా మంది ఇది నిజమైన వార్త లేక పబ్లిసిటీ స్టాంటా అని అభిప్రాయపడ్డారు.

దిల్ రాజు సమాధానం: అసలు నిజం ఏమిటి?

కేజిఎఫ్ పార్ట్ 2 మూవీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తేనే 85 కోట్ల షేర్ మార్క్ను తెలుగు రాష్ట్రాల్లో టచ్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు నిజంగానే ఈ సినిమాను అంత ధరకు కొనుగోలు చేశాడా? అనే వార్త తెలుగు ఫిలిం సర్కిల్లో వైరల్ అయింది. తాజాగా దిల్ రాజు ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో పాత్రికేయులు దిల్ రాజును మీరు టాక్సిక్ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 120 కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు, అది పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అనే ప్రశ్న పాత్రికేయుల నుండి దిల్ రాజుకు ఎదురైంది. దానికి దిల్ రాజు అలా అనుమానపడే వారికి నేను నా బ్యాంకు నుండి అమౌంట్ పంపాక దానిని వారికి ఇస్తాను, అప్పుడు వారికి తెలుస్తుంది ఏది నిజం అనేది అని సమాధానం ఇచ్చాడు.

దిల్ రాజు ‘టాక్సిక్’ మూవీ హక్కుల కొనుగోలు వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.