|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కళ్యాణి ప్రియదర్శన్ మధుబాలగా మెప్పించగలదా? భన్సాలీ సాహసం ఫలిస్తుందా?

Published: 11-04-2026, 8:05 AM
కళ్యాణి ప్రియదర్శన్ మధుబాలగా మెప్పించగలదా? భన్సాలీ సాహసం ఫలిస్తుందా?
  • మధుబాల బయోపిక్‌లో కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.
  • కళ్యాణిని ఎంపిక చేయడంపై మధుబాల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
  • సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ నటిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
  • కళ్యాణి రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘ప్రళయ్’ సినిమాలో నటిస్తోంది.

సంజయ్ లీలా భన్సాలీ మధుబాల జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి సిద్ధమయ్యారు. మధుబాల పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్‌ను ఎంపిక చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కళ్యాణి ప్రియదర్శన్‌పై నెటిజన్ల విమర్శలు

Madhubala Biopic: మధుబాల..’వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ జీవిత చరిత్ర సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కించేందుకు రెడీ అయిపోయాడు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.దీంతో ఈ పాత్రని పోషించే అదృష్టం ఎవరికి దక్కుతుందా అని క్యూరియస్ గా వాచ్ చేసిన మూవీ లవర్స్ కి షాక్ ఇస్తూ కళ్యాణి ప్రియదర్శన్ ని సెలెక్ట్ చేశాడన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.నిజానికి ఈ పాత్ర కోసం సాయి పల్లవి, సారా అర్జున్, కియారా అద్వానీ వంటి పేర్లు గట్టిగా వినిపించినా చివరికి ఆ ఛాన్స్ దక్కించుకుందని బి టౌన్ లో వినిపిస్తున్న టాక్.

కళ్యాణిలో మధుబాల స్థాయి గ్రేస్ ఉందా?

అయితే ‘లోకా’ సినిమాతో పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణిలో మధుబాల స్థాయి గ్రేస్ ఉందా?అన్నది ఇపుడు నెటిజన్ల నుండి వినిపిస్తున్న ప్రశ్న.ఎందుకంటే మధుబాల అంటే కేవలం అందం మాత్రమే కాదు,అభినయం కూడా.అలాంటి పాత్రకి సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ కాకుండా కళ్యాణిని ఎంచుకోవడం ఏంటో అని డిసప్పాయింట్ అవుతున్నారు మధుబాల ఫ్యాన్స్.అయితే కళ్యాణి ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ తో ‘ప్రళయ్’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న కారణంగానే భన్సాలీ ఆమెకు ఈ అవకాశం ఇచ్చారని,ఇది ‘మిస్ కాస్టింగ్’ అవడం పక్కా అని,మధుబాల జీవితంలో జరిగిన సంఘటనలని కల్యాణి సరిగ్గా పలికించకపొతే మాత్రం కల్యాణి తో పాటు భన్సాలీ కూడా ట్రోలర్స్ కి స్టఫ్ అవ్వడం ఖాయం.

భన్సాలీ నిర్ణయం వెనుక కారణాలేంటి?

లేటెస్ట్ గా రణ్‌వీర్ సింగ్ పక్కన ‘ప్రళయ్’

ఇక కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పాత్రల్ని చూస్తె అంతగా గుర్తుపెట్టుకునెంత నటన ఎక్కడా చేయలేదని,కేవలం ‘లోకా:చాప్టర్ 1’ సక్సెస్ చూసే ఈ ఛాన్స్ వచ్చిందని బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.అయితే ‘లోకా:చాప్టర్ 1’ సక్సెస్ లో కల్యాణి నటన కన్నా సినిమా మేకింగ్ కే ఎక్కువ మార్కులు పడ్డాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.ఇక లేటెస్ట్ గా రణ్‌వీర్ సింగ్ పక్కన ‘ప్రళయ్’ అనే సినిమాలో ఛాన్స్ వచ్చినంత మాత్రాన,ఆమె మధుబాల స్థాయి నటి అయిపోదంటూ అప్పుడే ట్రోల్స్ మొదలెట్టేశారు కూడా.

“ప్యార్ కియా తో డర్నా క్యా” అంటూ

ఇక మధుబాల విషయానికి వస్తే 1933 ఫిబ్రవరి 14న పుట్టిన ఈమె అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావి.తన 9వ ఏటనే ‘బసంత్’ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ గా ఎదిగింది.ముఖ్యంగా ‘మొఘల్-ఎ-అజామ్’ చిత్రంలో ఆమె పోషించిన అనార్కలి పాత్ర ఎవర గ్రీన్ అని చెప్పాలి.అందులో “ప్యార్ కియా తో డర్నా క్యా” అంటూ ఆమె పలికించిన ఎక్స్ప్రెషన్స్ నేవర్ బిఫోర్,ఎవర ఆఫ్టర్.అయితే సినిమాల పరంగా ఎంత హైట్స్ చూసిందో పర్సనల్ లైఫ్ లో అంత బాధల్ని మూటగట్టుకుంది.ముఖ్యంగా ఆమె దిలీప్ కుమార్‌తో నడిపిన ప్రేమాయణం పెళ్లి వరకు రాకపోవడం ఆమెని బాగా కుంగ దీసింది.

మధుబాల జీవితం.. ఒక brief లుక్

చివరి రోజుల్లో ఇలా అనాధలా

ఆ తర్వాత 1960లో ప్రముఖ గాయకుడు,నటుడు కిషోర్ కుమార్‌ను ఆమె పెళ్లి చేసుకున్నప్పటికి అది చివరవరకి కొనసాగాకుండానే సమాప్తం అయింది.మధుబాలకి హార్ట్ లో హోల్ ఉందన్న విషయం తెలీడంతో,ట్రీట్ మెంట్ కోసం లండన్ తీసికెళ్ళినా ప్రయోజనం లేకపోయిందట.దీంతో కిషోర్ కుమార్ ఆమెను తన పాత బంగ్లాలో ఉంచి సరిగ్గా పట్టించుకోకపోవడంతో దిక్కులేని అనాధలా చనిపోయిందని చెప్పుకుంటారు.ఏది ఏమైనా కోట్లాది ప్రేక్షకులని తన అందం అభినయం తో కట్టిపడేసిన ఈ అపురూప సుందరి చివరి రోజుల్లో ఇలా అనాధలా చనిపోవడం చాలా బాధాకరం.మరి ఇంతటి ఇంటెన్స్,ఎమోషన్స్ ఉన్న మధుబాల పాత్రలో కల్యాణి ఎలా ఒదిగిపోతుందో వేచి చూడాల్సిందే!

మొత్తానికి కళ్యాణి ప్రియదర్శన్ మధుబాల పాత్రలో ఎంతవరకు మెప్పించగలదో చూడాలి. ఒకవేళ సరిగ్గా నటించకపోతే మాత్రం ట్రోల్స్ తప్పవు అంటున్నారు నెటిజన్లు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.