|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ సింగ్‌తో జాంబీ థ్రిల్లర్: బాలీవుడ్‌లోకి కళ్యాణి ప్రియదర్శన్ ఎంట్రీ అదిరింది!

Published: 04-01-2026, 1:00 PM
రణ్‌వీర్ సింగ్‌తో జాంబీ థ్రిల్లర్: బాలీవుడ్‌లోకి కళ్యాణి ప్రియదర్శన్ ఎంట్రీ అదిరింది!
  • కళ్యాణి ప్రియదర్శన్ తాజా చిత్రం ‘లోకా : చాప్టర్ 1 -చంద్ర’ రూ. 300 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
  • ఆమె రణ్‌వీర్ సింగ్ జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది.
  • ఈ చిత్రం పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ సర్వైవల్ స్టోరీగా భారీ VFX, ఎమోషనల్ డెప్త్‌తో రూపొందనుంది.
  • జై మెహతా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను రణ్‌వీర్ సింగ్ స్వయంగా నిర్మించనున్నారు.

సౌత్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’లో లీడింగ్ లేడీగా కనిపించనుంది. ఆమె ఇటీవలి విజయం తర్వాత ఈ బిగ్ డెబ్యూపై అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ సక్సెస్

బ్యూటిపుల్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా ‘లోకా : చాప్లర్ 1 -చంద్ర’తో భారీ సక్సెస్ అందుకుంది. ఇంటెన్స్ యాక్షన్ లుక్స్‌తో అదరగొట్టింది. ఫీమెల్ సెంట్రిక్‌గా వచ్చిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లు వసూల్ చేసింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ‘ధురంధర్’ తర్వాత రణ్‌వీర్ సింగ్ చేస్తున్న జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’లో లీడింగ్ లేడీగా కనిపించబోతుంది. ఈ చిత్రానికి జై మెహతా దర్శకుడు కాగా ఇది ఆయన ఫీచర్ డైరెక్టోరియల్ డెబ్యూగా మారనుంది. పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ సర్వైవల్ స్టోరీ, భారీ VFX, వరల్డ్ బిల్డింగ్‌తో ఎమోషనల్‌ డెప్త్‌తో ఉండబోతుంది. World War Z లేదా I Am Legend లాంటి టోన్‌లో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ టాక్. కాగా ఈ సినిమాను రణ్‌వీర్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. ‘మా కసమ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై.. హన్సల్ మెహతా ట్రూ స్టోరీ ఫిల్మ్స్, సమీర్ నాయర్ అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడని.. షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అవుతుందని టాక్.

రణ్‌వీర్ సింగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఖరారు

‘ప్రళయ్’ స్టోరీలైన్, నిర్మాణం వివరాలు

కళ్యాణి ప్రియదర్శన్ బాలీవుడ్ డెబ్యూ ‘ప్రళయ్’ తో సంచలనం సృష్టించడం ఖాయం. రణ్‌వీర్ సింగ్ నిర్మాణంలో వస్తున్న ఈ జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.