
📌 Key Points
- కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ‘హలో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
- కొత్తలోక చిత్రంలో సూపర్ లేడీ పాత్రలో కళ్యాణి కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
- నిర్మాతలు కథలకంటే నటులకే ప్రాధాన్యమిస్తున్నారని కళ్యాణి అభిప్రాయపడ్డారు.
- కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలలో నటిస్తున్నారు.
ప్రముఖ నటి కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా నిర్మాతల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాతలు కథల కంటే నటులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె అన్నారు. దీనిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కళ్యాణి ప్రియదర్శన్ సినీ ప్రస్థానం
Kalyani Priyadarshan:ప్రముఖ మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ చిత్ర నిర్మాత ప్రియదర్శన్, ప్రముఖ నటి లిస్సీ దంపతులకు 1993 ఏప్రిల్ 5న చెన్నైలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది.ఈమెకు తమ్ముడు కూడా ఉన్నారు. 2017లో అఖిల్ (Akhil) హీరోగా వచ్చిన ‘హలో’ సినిమా ద్వారా నటనా రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఈ సినిమాతో ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో సౌత్ ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఇక ఆ తర్వాత చిత్ర లహరి, రణరంగం వంటి చిత్రాలలో నటించిన ఈమె.. మళ్లీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కొంతకాలం తమిళ్లో నటించిన ఈమె.. ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీకే పరిమితం అయింది. కానీ గత ఏడాది మలయాళం ‘లోక చాప్టర్ వన్:చంద్ర’ పేరుతో తెలుగులో ‘కొత్తలోక’ అంటూ ప్రేక్షకులను మళ్లీ పలకరించింది.
ఇక ఇందులో తొలిసారి సూపర్ లేడీ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. మలయాళంలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో నన్ను ఉత్తేజపరిచేది ప్రేక్షకాదరణ ఒకటే కాదు.. స్వేచ్ఛ కూడా.. నేను కోరుకునే కథలను ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించడం. చాలా మంది నిర్మాతలు కథల కంటే కూడా స్టార్లకే ఎక్కువ మద్దతు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది. వారికి నేను కూడా అలాగే మద్దతునిస్తాను. నా కథల ఎంపిక విషయంలో స్వేచ్ఛ పొందుతాను” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే నిర్మాతలు కథల కంటే స్టార్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని కళ్యాణి ప్రియదర్శన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నిర్మాణ సంస్థలపై కళ్యాణి కామెంట్స్
తమిళంలో కళ్యాణి ప్రియదర్శన్ బిజీ
కళ్యాణి ప్రియదర్శన్ లోక చాప్టర్ 1 : చంద్ర చిత్రంతో మంచి విజయం అందుకోవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు స్వయంగా కళ్యాణి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం జయం రవి, కృతి శెట్టి కళ్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లో జెనీ అనే సినిమా వస్తోంది. అలాగే తమిళంలో దేవదర్శినితో పాటు తిరవియం ఎస్ ఎన్ దర్శకత్వం వహిస్తున్న థ్రిల్లర్ ప్రాజెక్టులో భాగమైంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె. ఇక వరుస అవకాశాలు అందుకొని.. మరింత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మొత్తానికి కళ్యాణి ప్రియదర్శన్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.


