|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కొత్తలోక’ సీక్వెల్: కళ్యాణి ప్రియదర్శన్ సంచలన ప్రకటన! షూటింగ్ ఎప్పుడో తెలుసా?

Published: 19-02-2026, 1:35 AM
‘కొత్తలోక’ సీక్వెల్: కళ్యాణి ప్రియదర్శన్ సంచలన ప్రకటన! షూటింగ్ ఎప్పుడో తెలుసా?
  • ‘కొత్తలోక’ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
  • కళ్యాణి ప్రియదర్శన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
  • సెప్టెంబర్ నుండి ‘లోకా 2’ షూటింగ్ ప్రారంభం కానుంది.
  • మళ్లీ చంద్ర పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ కనిపించనుంది.

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ సినిమాతో పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్, ‘కొత్తలోక’ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది.

కొత్తలోక సినిమా విశేషాలు

Kalyani Priyadarshan:అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా వచ్చిన ‘హలో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు , తమిళ్, మలయాళం అంటూ వరుస సినిమాలు చేసిన ఈమె.. కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి… మలయాళంలోనే అవకాశాలు అందుకుంది.. అలాంటి ఈమె గత ఏడాది ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ అనే పేరుతో సినిమా చేసింది. ఇదే సినిమాను తెలుగులో ‘కొత్తలోక’ అంటూ విడుదల చేశారు. తొలిసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో కళ్యాణీ చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.సుమారుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది . ఈ సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ కి అవకాశాలు కూడా తలుపు తడుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఈమె కొత్తలోక సీక్వెల్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. విషయంలోకి వెళ్తే వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన కొత్తలోక చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. కళ్యాణి ప్రియదర్శన్ చంద్ర పాత్రలో నటించింది. నెస్లెన్, టోవినో థామస్, సౌబిన్ షాహిర్ తదితరులు కీలకపాత్రలో కనిపించారు.. విడుదలైన మూడు రోజుల్లోనే మలయాళంలో రూ.42 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్క్ అందుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇండియాలో తొలి సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు భావోద్వేగాలను సమతూకంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సీక్వెల్ గురించి కళ్యాణి ఏమన్నారంటే?

ముఖ్యంగా కళ్యాణి ప్రియదర్శన్ యాక్షన్ పర్ఫామెన్స్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ప్లస్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా తాజాగా కార్యక్రమంలో పాల్గొన్న కళ్యాణి ఈ సినిమా సీక్వెల్స్ గురించి మాట్లాడుతూ.. “ప్రస్తుతం లోకా 2 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. నేను కూడా ఈ ప్రాజెక్టులో భాగమే.. మళ్ళీ చంద్ర పాత్ర అనే పోషిస్తున్నాను” అంటూ తెలిపింది. తొలిభాగం విజయం కారణంగా సీక్వెల్ పై అంచనాలు కూడా పెరిగిపోయాయి. గత ఏడాది ఓనం కానుకగా విడుదలైన ఈ సినిమా కేరళలో అదనపు షోలు పడేంత ప్రేక్షకఆదరణ పొందింది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ లోవచ్చిన ట్విస్ట్ లు కథను ఉత్కంఠ భరితంగా మార్చేశాయి. సాధారణ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నంగా సూపర్ ఉమెన్ గా కళ్యాణి పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది. అలా మొత్తానికైతే ప్రస్తుతం సీక్వెల్ పై ఊహించని అప్డేట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది కళ్యాణి ప్రియదర్శన్

షూటింగ్ ఎప్పుడు ప్రారంభం?

ఈమె బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శని, ప్రముఖ నటి లిస్సీ దంపతుల కుమార్తె . న్యూయార్క్ లో ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేసిన కళ్యాణి నటనపై ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈమె హలో చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది.

మొదటి భాగం విజయం సాధించడంతో, సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. కళ్యాణి ప్రియదర్శన్ మరోసారి చంద్ర పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.