
మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆమె నటించిన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ చిత్రం మలయాళంలో 300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి, ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కళ్యాణి విజయానికి నెటిజన్లు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
Key Points
'లోక చాప్టర్ 1: చంద్ర' చిత్రం మలయాళంలో 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల మునుపటి రికార్డులను ఈ సినిమా అధిగమించింది.
కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా మలయాళంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం ఒక సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రానుంది.
లోక చాప్టర్ 1: చంద్ర – కలెక్షన్స్ సునామీ
Kalyani Priyadarshan : మలయాళ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు సినిమాలతో కూడా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల కళ్యాణి ‘లోక చాప్టర్ 1: చంద్ర అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజయి భారీ హిట్ అయింది. కేవలం 30 కోట్లు ఖర్చుపెట్టి అదిరిపోయే విజువల్స్ తో సరికొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కించారు.(Kalyani Priyadarshan)
‘లోక చాప్టర్ 1: చంద్ర సినిమా కేవలం మళయాళంలోనే కాక తమిళ్, తెలుగు, హిందీలో కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజవ్వగా ఇప్పటికి థియేటర్స్ లో ఆడుతుంది. సుమారు 20 రోజుల క్రితం ఈ సినిమా 275 కోట్లు కలెక్ట్ చేసి మలయాళం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని అందుకుంది.
స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన కళ్యాణి
ఇన్ని రోజుల వరకు మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా 265 కోట్లతో మొదటి స్థానంలో, మోహన్ లాల్ తుడురమ్ 242 కోట్లతో రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు లోక చాప్టర్ 1: చంద్ర సినిమా 300 కోట్లతో మొదటి ప్లేస్ లో నిలిచింది. ఆ రెండు సినిమాలను వెనక్కు నెట్టింది. కళ్యాణి ప్రియదర్శన్ వుమెన్ సెంట్రిక్ తో ఓ సూపర్ హీరో సినిమాతో మలయాళంలో స్టార్ హీరోలందర్నీ వెనక్కి నెట్టి అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మలయాళం సినిమాగా నిలవడంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు మలయాళ ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు.
సినిమాటిక్ యూనివర్స్ లో భాగం
ఇక ఈ లోక చాప్టర్ 1: చంద్ర సినిమాని మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ పై డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇదొక సినిమాటిక్ యూనివర్స్ గా రానుంది. దీంట్లో 5 సినిమాలు అయితే పక్కా ఉంటాయి. అందులో రెండిట్లో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ మెయిన్ లీడ్స్ లో నటించనున్నారు. ఈ ఇద్దరూ లోక చాప్టర్ 1: చంద్ర సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించారు.
Also See : Sobhita Dhulipala : బ్లాక్ డ్రెస్ లో శోభిత ధూళిపాళ బ్యూటీ..
కళ్యాణి ప్రియదర్శన్ ‘లోక చాప్టర్ 1: చంద్ర’తో మలయాళ సినీ చరిత్రలో ఓ విమెన్ సెంట్రిక్ సూపర్ హీరో చిత్రంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇది మలయాళ సినిమాకు ఒక కొత్త అధ్యాయాన్ని, కళ్యాణికి గొప్ప విజయాన్ని సూచిస్తుంది. ఈ చిత్రం విజయం ఆమె కెరీర్‌కు మరింత బలాన్ని చేకూర్చనుంది.


