|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇది నాకు పెద్ద సవాలుగా మారింది..పోస్ట్‌తో షాకిచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. బాబోయ్ ఇదేం ట్విస్ట్ అంటున్న నెటిజన్లు!

Published: 07-10-2025, 11:19 PM
ఇది నాకు పెద్ద సవాలుగా మారింది..పోస్ట్‌తో షాకిచ్చిన కళ్యాణి ప్రియదర్శన్.. బాబోయ్ ఇదేం ట్విస్ట్ అంటున్న నెటిజన్లు!

మలయాళీ నటి కళ్యాణి ప్రియదర్శన్ తన కొత్త చిత్రం ‘జీని’ తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇటీవల విడుదలైన ‘అబ్డి.. అబ్డి’ సాంగ్ గురించి ఆమె చేసిన పోస్ట్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సవాలుతో కూడుకున్నదని ఆమె తెలిపారు.

Key Points

1

కళ్యాణి ప్రియదర్శన్ 'జీని' చిత్రంలో నటిగా కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

2

చిత్రం నుండి విడుదలైన 'అబ్డి.. అబ్డి' పాట చాలా ప్రత్యేకమైనది.

4

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

కళ్యాణి ప్రియదర్శన్: ‘జీని’ లో కొత్త సవాలు

మ లయాళ యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుని ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక ఇటీవల లోకా: చాప్టర్ 1’ సినిమాతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ‘లోకా:చాప్టర్1’ మూవీతో కళ్యాణి సూపర్ హీరోగా మారిన మొదటి బ్యూటీగా రికార్డు క్రియేట్ చేసింది. భారీ కలెక్షన్లు రాబట్టి.. బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇప్పటికీ థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, కళ్యాణి ప్రియదర్శన్ ఓ కొత్త సినిమాను ప్రటిస్తూ ఓ పోస్ట్ పెట్టింది

మొదటి సింగిల్ ‘అబ్డి.. అబ్డి’ వివరాలు

‘జీని’ తమిళ చిత్రంతో రాబోతుంది. ఇక ఇందులోంచి ఫస్ట్ సింగిల్ ‘అబ్డి.. అబ్డి’ సాంగ్ షేర్ చేస్తూ.. ‘‘నటిగా నేను ఎప్పుడూ చేయని పనులు చేయడానికి నన్ను నేను సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇది నాకు సవాలుగా మారింది. ఈ పాట అలాంటి క్షణాలలో ఒకటి. మా దర్శకుడు భువనేష్ దాని గురించి నాకు చెప్పినప్పుడు, అతను ఇంత మంచి వాణిజ్య సంగీత భాగాన్ని ‘జీని’(genie)కథలో నిజమైన, ముఖ్యమైన భాగంగా ఎంత చక్కగా తీర్చిదిద్దాడో చూసి నేను ఆశ్చర్యపోయాను. మీరందరూ దానిని సినిమాలో చూసే వరకు నేను వేచి ఉండలేను. దాని వెనుక ఉన్న కారణాలు చాలా శక్తివంతమైనవి. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడి పనిచేశాను. కొత్తగా ప్రయత్నించాను. మీ అందరికీ ఇది నచ్చుతుందని నేను నిజంగా ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది.

జీని: బహుభాషా చిత్రం, స్టార్ క్యాస్ట్

అలాగే రెడ్ కలర్ డ్రెస్ ధరించి నడుము, చూపిస్తూ కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. కాగా.. ఈ ‘జీని’ మూవీలో రవి మోహన్ (Ravi Mohan)హీరోగా నటిస్తుండగా.. కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జునన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతున్న 25వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. దీనిని డా. ఐసరి కె. గణేష్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

‘జీని’ చిత్రం కళ్యాణి ప్రియదర్శన్‌కు మరో మైలురాయిగా నిలవనుంది. భారీ తారాగణం, ఏఆర్ రెహమాన్ సంగీతం, బహుళ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.