
పొలిమేర సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన కామాక్షి భాస్కర్ల, ‘షో టైమ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Key Points
కామాక్షి భాస్కర్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమాని
అరవింద సమేత చూడటానికి వెళ్లి నవీన్ చంద్ర అభిమానిగా తిరిగొచ్చారు
నవీన్ చంద్ర 'పొలిమేర-2' లో ఆమె నటనకు అభినందనలు తెలిపారు
సినిమాలను థియేటర్లలో చూడాలని ఆడియన్స్‌కు విజ్ఞప్తి
ఎన్టీఆర్ అభిమాని నుండి నవీన్ చంద్ర అభిమానిగా
పొలిమేర సినిమాలతో ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ఆమె షో టైమ్ అనే మూవీలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తాను జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానినని కామాక్షి భాస్కర్ల అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్‌గా అరవింద సమేత సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లి.. నవీన్ చంద్ర అభిమానిగా బయటికొచ్చానని తెలిపింది. పొలిమేర-2 చూసిన తర్వాత నవీన్ చంద్ర వ్యక్తిగతంగా నన్ను అభినందించారు. ఈ సినిమాలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.. ఈ విషయంలో నవీన్ చంద్రతో పాటు డైరెక్టర్‌కు నా ధన్యవాదాలు.. మా సినిమాలను ఓటీటీలో కాకుండా థియేటర్లకు వచ్చి చూడాలని ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేసింది కామాక్షి భాస్కర్ల.
‘షో టైమ్’ సినిమా ట్రైలర్ విడుదల
థియేటర్లలో సినిమాలు చూడాలని విజ్ఞప్తి
చివరగా, కామాక్షి భాస్కర్ల తన అభిమాన హీరోల గురించి, ‘షో టైమ్’ సినిమా గురించి తెలిపారు. సినిమాను థియేటర్లలో చూడాలని ఆమె ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.


